నల్లగొండ..పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పరిశీలనకలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారితో కలిసి నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి

 కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తో

కలిసి నల్లగొండ శాసనసభ్యులు

 కంచర్ల భూపాల్ రెడ్డి





 నల్లగొండ..పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పరిశీలన.


♦️ త్వరలో..మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ నల్లగొండలో పర్యటించే అవకాశం ఉన్నందున పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.


♦️ మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద నిర్మించనున్న ఫ్లైఓవర్ సర్వీస్

 రోడ్ల,& రైల్వే అండర్ పాస్ వద్ద పనులను పరిశీలించి పలు సూచనలు.


♦️ మర్రిగూడ బైపాస్ రోడ్డు  నుండి కలెక్టరేట్ వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశం.


♦️IT హబ్ నిర్మాణ పనులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే. త్వరగా నిర్మాణం పనులు పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం సిద్ధం చేయవలసిందిగా, గుత్తేదారుకు ఆదేశం.


♦️ బీట్ మార్కెట్ వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిశీలన.. పలు సూచనలు.


♦️ ఎస్డిఎఫ్ 6 కోట్ల రూపాయలు నిధులతో పట్టణంలో, 5వ వార్డ్ మహిళా ప్రాంగణం వద్ద నుండి, 25 వ వార్డు సాగర్ క్రాస్ రోడ్ వద్ద నుండి, 32 వ వార్డు రాక్ హిల్స్ కాలనీ నుండి  నిర్మించనున్న వరద కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన.

 పనులు వెంటనే చేపట్టి, నాణ్యతతో  త్వరగా పనులు పూర్తి చేయాలని  అధికారులకు ఆదేశం.


 పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కెవి రమణ చారి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు  ఖయ్యుమ్ బేగ్, ఊటుకూరు వెంకట్ రెడ్డి, పున్న గణేష్,వట్టిపల్లి శ్రీనివాస్, ఆంగోతు  ప్రదీప్ నాయక్, గోగుల శ్రీనివాస్ యాదవ్ ,బోయినపల్లి శ్రీనివాస్, మహమ్మద్ సమీయుద్దీన్, యామా కవిత దయాకర్, మహమ్మద్ ఇబ్రహీం, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి,

  పట్టణ పార్టీ కార్యదర్శి బోనగిరి దేవేందర్, అధికార ప్రతినిధి సంధినేని జనార్దన్ రావు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, తలారి యాదగిరి మిరియాల స్వామి, అలుగుబెల్లి కిరణ్ రెడ్డి,గంజి రాజేందర్, పలువురు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు వెంట ఉన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...