**తెలంగాణ రాష్ట్రంలోనే అగ్ర భాగంలో నల్లగొండ షీ టీమ్స్* .
*మహిళలకు అండగా నల్లగొండ షి టీమ్స్*
- - *ఫిర్యాదుల స్వీకరణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం*
- - *మహిళలను వేధించే వారిపట్ల సింహస్వప్నంగా పని చేస్తున్న షీ టీం బృందాలు*
*జిల్లా యస్.పి కె. అపూర్వ రావు
ఐ.పి.యస్.*
జిల్లా పోలీస్ కార్యాలయం నల్లగొండ నందు ఈ రోజు రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా షి టీమ్ మెరుగైన పని తీరు చేస్తూ అగ్ర భాగంలో ఉన్నందున ఉమెన్ సేఫ్టీ వింగ్ వారి అధ్వర్యంలో రాష్ట్ర లోని ఏనిమిది జిల్లాల షి టీమ్ బృందాలకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యస్.పి గారు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత మహిళల రక్షణకు పెద్డ పీట వేయాలన్న సంకల్పంతో,మహిళల రక్షణలో యావత్ భారత దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగంలో నిలిపాయని, రాష్ట్రానికి షి టీమ్స్ మహిళలు రక్షణలో వెన్నుముక లాంటివి అని,ఈ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోటా డేగ కళ్లతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ పని చేస్తున్నాయని అన్నారు. షి టీమ్స్ రక్షణ కల్పించే విషయంలోనే కాదు మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా, పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూ.ఆర్ కోడ్ స్కానింగ్ పద్దతిలో, వాట్స్ అప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీ టీమ్స్ వారి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయని అన్నారు.
మహిళల సమస్యలపై పిర్యాదు చేయడానికి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు..
నల్లగొండ – 9963393970
షీ టిమ్ మిర్యాలగూడ:8688388489
దేవరకొండ - 9705080942 .
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద్ రావు, ఉమెన్ సేఫ్టీ వింగ్ డి.యస్.పి శేఖర్ రెడ్డి, సి. ఐ శ్రీనివాస్,షి టీమ్ ఇంఛార్జి సిఐ రాజశేఖర్ గౌడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.