తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఏఎస్ అధికారిణి శాంతికుమారి
ని సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం ఆదేశాల మేరకు జీఏడీ కార్యదర్శి వి. శేషాద్రి బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెలువడిన వెంటనే శాంతికుమారి ప్రగతి భవన్‌కు చేరుకొని సీఎం కేసీఆర్‌ను కలిశారు.
ప్రస్తుతం ఆమె అటవీ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎస్‌గా నియమితులైన శాంతికుమారి బాధ్యతలు స్వీకరించారు. గతంలో శాంతికుమారి సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి 2025 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకు ఆమె సీఎస్‌గా కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు.శాంతి కుమారి మృధుస్వభావిగా, పాలానాధికారం నెరపడంలో నేర్పరిగా పేరున్నది. ఈమె ఏపీ వాసి కావటం, ఆమె సామాజిక వర్గం, బీఆర్‌ఎస్ ఏపీలో విస్తరించటం అనే అంశాలు శాంతి కుమారికి అదనపు ప్రాధాన్యతను కల్పించడంలో కలిసి వస్తుందని అనుకుంటున్నారు.