నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల
గారు క్యాంపు కార్యాలయంలో " ప్రెస్ మీట్" నిర్వహించారు.*
*ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ...*
*◆నిజామాబాద్ నగర అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించింది గౌ.ముఖ్యమంత్రి శ్రీ గారు..*
*◆త్వరలో నగరానికి రానున్న గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు..*
*◆900 కోట్ల రూ.లతో నిజామాబాద్ అభివృద్ధి పనులు..*
*◆అదనంగా సుందరీకరణకు100 కోట్ల నిధుల మంజూరు చేసిన గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు..*
*◆పాత కలెక్టర్ కార్యాలయం లో కళ భారతి నిర్మాణం..*
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాయకత్వం లో నిజామాబాద్ నగరం అభివృద్ధి లో పరుగులు పెడుతుంది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నాము.ప్రతి కాలని లో రోడ్లు,డ్రైనేజి ,వీధి లైట్లు, మంచినీటి వసతి కల్పించాము.
ప్రజల సహకారం తో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనుల ని ఛాలెంజ్ గా తీసుకొని పూర్తి చేసాము.IT హబ్,అహ్మది బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్,మినీ ట్యాంక్ బండ్ లో నిర్మాణం లో ఉన్నాయి.అతి త్వరలో ప్రజలకి అందుబాటులో కి తెస్తాము.
దుబ్బా ప్రాంతంలో 5 ఎకరాల్లో అన్ని సదుపాయాలతో స్మశాన వాటిక నిర్మిస్తున్నాము.ద్వారక నగర్,అర్సపల్లి,వర్ని రోడ్ కిల్ల స్మశాన వాటికల పనులు జరుగుతున్నాయి.
ప్రధాన రహదారులు విస్తరణ కొరకు 36 విద్యుత్ నియంత్రికలు 169 విద్యుత్ స్థంబాలు పక్కకి జరిపి ఒక్క నిర్మాణం కూల్చకుండా విస్తరణ చేసాము.
నిజామాబాద్ నగరంలో నలు దిక్కుల వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ లు నిర్మించాలని గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఆదేశించారు. వారి సూచన మేరకు ఖలీల్ వాడి లోని RDO కార్యాలయం,సౌత్ MRO కార్యాలయం,DEO కార్యాలయం వద్ద ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ లు నిర్మిస్తున్నాము.
ఆర్మూర్ రోడ్డు, వినాయక్ నగర్ ప్రాంతం లో మరో రెండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ల నిర్మాణానికి స్థల పరిశీలనలు జగతున్నాయి.
రజక సోదరుల కొరకు పరిశుభ్ర వాతావరణం లో ధోభీ ఘాట్ ల నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేస్తున్నాము.రజకులతో సమావేశం నిర్వహించాము.త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తాము.
నాయి బ్రాహ్మణులకు బాసటగా సెలూన్లు ఆధునికరించుకొనేందు ప్రణాళికలు తయారూ చేస్తున్నాము.
తిలక్ గార్డెన్ చాలా రోజుల క్రితం నిర్మించారు.మరింత ఆహ్లాదంగా తయారు చేసేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేకా ఆర్కిటెక్చర్ బృందం రేపు నగరానికి వస్తుంది.వీరి పరిశీలన చేసిన తరువాత అవసరమైన చర్యలు తీసుకుంటాము.
బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన జరుగుతుంది.ప్రభుత్వ స్థలాలు సర్వే జరుగుతుంది.నగరం మధ్యలో రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో బస్టాండ్ ఉండాలనే ఉద్దేశం తో స్థలాలను పరిశీలిస్తున్నాము.త్వరలోనే స్థలాన్ని గుర్తించి మోడల్ బస్టాండ్ నిర్మిస్తాము.
నిజామాబాద్ నగరం పట్టణీకరణ చెందుతుంది.పట్టణీకరణ కి అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారు,నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు,మాజీ మేయర్ ఆకుల సుజాత గారు,మాజీ రెడ్కో చైర్మన్ SA అలీం గారు, TRS కార్పొరేటర్లు/నాయకులు పాల్గొన్నారు.