నేడు కంచర్ల జన్మదినోత్సవాన్ని
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పట్టణంలోని వార్డుల లో వాడవాడల.. ఘనంగా నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు....
తెల్లవారుజాము నుండే అభిమానుల తాకిడి...
రామగిరి రామాలయం,ధర్వేశిపురం, ఆలయాలండి స్వామి వారి, అమ్మవారి,శేషమాల శేష వస్త్రం తో అర్చకుల ఆశీర్వచనం...
తులసి నగర్ హనుమాన్ దేవాలయంలో..చైర్మన్ ఆధ్వర్యంలో ఆయుష్య హోమం..
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ల.. ఆధ్వర్యంలో...పట్టణం లో భారీ ఏర్పాట్లు...
పట్టణంలో హోర్డింగులు ప్లేక్సీ లు కటౌట్లతో... అభినందనలు.
క్రేన్ సహాయంతో ఫల పుష్పాలు కూర్చిన భారీ దండను... కంచర్లను మెడను అలంకరించిన అభిమానులు...
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద.. 500 మందికి, అల్పాహారం,పళ్ళు పంపిణీ..
దేవరకొండ రోడ్డు మరియు ఇతర పలు కాలనీలలో కంచర్ల జన్మదిన సందర్భంగా అన్నదానాలు ..
రక్తదాన శిబిరంలో భారీగా స్పందన...
ముఖ్య అతిథిగా విచ్చేసి ఆశీర్వదించిన.. జడ్పీ చైర్మన్ బండా
నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని.. భారీ ఏర్పాట్ల మధ్యన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆనందోత్సాహాల మధ్యన ఘనంగా నిర్వహించారు... వేకవజాము నుండి అభిమానులు, నాయకులు పుర ప్రముఖులు అధికారులు పూల బొకేలు శాలువాలు పుస్తకాలు పెన్నులతో,
శుభాకాంక్షలు తెలియజేశారు... ఉదయం తులసి నగర్ హనుమాన్ దేవాలయంలో చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన.. ఆయుష్య హోమం పూర్ణాహుతి అనంతరం.. మరి స్వగ్రామం ఉరుమడ్లలో.. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. ఉదయం 11 గంటల నుండి.. నల్గొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుండి శుభాకాంక్షలు అందుకున్నారు...
వివేకానంద విగ్రహం నుండి క్యాంప్ ఆఫీస్ వరకు ర్యాలీగా తీసుకొచ్చారు.. పుష్పాలు పళ్ళతో ఏర్పాటు చేసిన భారీ దండను క్రేన్ సహాయంతో... కంచర్ల మెడను అలంకరించారు బాణాసంచా, బ్యాండ్ మేడాలతో ఊరేగింపుగా క్యాంపు కార్యాలయం వరకు తీసుకుని వచ్చారు అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికి వేదిక తోడుకొని వచ్చి, సర్వ మత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, అభిమానుల కేరింతల మధ్యన భారీ కేక్ కట్ చేసారు..
నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు...
ముస్లిం మైనారిటీ నాయకులు ప్రత్యేకంగా 30 కిలోల భారీ కేకును కంచర తో కట్ చేయించి శుభాకాంక్షలు
తెలియజేశారు...
అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు రక్తదానాన్ని చేసారు..పట్టణంలో
పలుచోట్ల కంచర్ల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదానాన్ని నిర్వహించారు...... ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో 500 మందికి అల్పాహారం, రోగులకు పండ్లు,పంపిణీ చేశారు. దేవరకొండ రోడ్డు, మరియు పలు కాలనీలు అనాధాశ్రమాల్లో అభిమానులు అన్నదానం చేశారు....
ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్, ఎంజి యూనివర్సిటీ సేనేట్ సభ్యులు బోయపల్లి కృష్ణారెడ్డి, ఎంపీపీలు కరీం పాషా,నాగులవంచ విజయలక్ష్మి, కనగల్ జడ్పిటిసి చిట్ల వెంకటేశం, చీర పంకజ్ యాదవ్ కటికం సత్తయ్య గౌడ్, మాల శరణ్య రెడ్డి బక్క పిచ్చయ్య మైనం శ్రీనివాస్,ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, దేప వెంకట్ రెడ్డి ఐతగోని యాదయ్య వంగాల సహదేవరెడ్డి పాశం సంపత్ రెడ్డి, ఆలకుంట నాగరత్నం రాజు ధోటి శ్రీనివాస్ పలువురు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు కోఆప్షన్ సభ్యులు నాయకులు కార్యకర్తలు అధికారులు అనధికారులు పుర ప్రముఖులు వందలాదిగా తరలివచ్చి కంచర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.