*అక్రమ గంజాయిని రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులు అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు*
-జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ.పి.యస్
Ø *ఎనిమిది మంది నిందితులు అరెస్టు*
Ø *వీరి వద్ద నుండి (217) గంజాయి ప్యాకెట్‌లు (ఒక్కొక్కటి 2 కేజీలు 434 కేజీల గంజాయి) వీటి మొత్తం విలువ రూ. 27.00 లక్షల రూపాయలు.*
Ø *ఒక DCM, మూడు కార్లు, ఒక పల్సర్ బైక్ మరియు 08 సెల్ ఫోన్‌లను స్వాధీనం* .
తెలంగాణ రాష్ర్ట డి.జి.పి గారి ఆదేశాల మేరకు , మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా మరియు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు నిరంతర నిఘా లో బాగంగా ఈ రోజు నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ రెమా రాజేశ్వరి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 26.08.2022 ఉదయం, విశ్వసనీయ సమాచారం మేరకు మిర్యాలగూడ రూరల్ మరియు మిర్యాలగూడ I టౌన్ పోలీసులు జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం సమన్వయంతో వివిధ ప్రదేశాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి, ఒక డి.సి.యం మూడు కార్లు ఒక బైక్ -వీలర్లు అవి AP 39 HD 3165 (స్విఫ్ట్ డిజైర్), TS 07 EA 0322 (స్విఫ్ట్ డిజైర్), (స్కోడా వైట్ కలర్ కారు) AP 28 BK 1111 మరియు D C M AP 03 TB 2444 220 CC TS 07 FL 0752 మరియు ఎనిమిది మంది గంజాయి నిందితులను (ఒరిస్సా నుండి ఒకరు, ఆంధ్ర ప్రదేశ్ నుండి ముగ్గురు మరియు మిగిలిన నలుగురు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు), 434 కిలోల గంజాయి మరియు 8 సెల్ ఫోన్‌లను స్వాదీనం పరుచుకొని రెండు వేర్వేరు ప్రదేశాలలో అదుపులోకి తీసుకోవడం జరిగింది.
వివరలోకి వెళ్తే మొదటి కేసు:
మిర్యాలగూడ రూరల్ PS కేసు వివరాలు (Cr.No. 197/2022 u/s 8© r/w 20(b)(ii) (c) of NDPS చట్టం, 1985)
తేదీ 26-08-2022న ఉదయం మిర్యాలగూడ రూరల్ పోలీసులు, జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం సమన్వయంతో మిర్యాలగూడ రూరల్ PS పరిధిలోని ఆలగడప టోల్‌ప్లాజాలో వాహన తనిఖీలు నిర్వహించగా, ఒక స్కోడా వైట్ కలర్ కారును ఒక బైక్ ను ఆపి తనికి చేయగా అందులో అక్రమ గంజాయి (27) ప్యాకెట్లు (ఒక్కకటి 2 కిలోలు 54 కిలోల) గంజాయిని స్వాధీనం చేసుకుని వెంటనే, వారిని పట్టుకుని విచారించగా, వారి చెప్పిన వివరాల ప్రకారం మజ్జి శంకర్ తండ్రి: తాతారావు, మల్కాన్ గిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రం అని నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ గంజాయి వ్యాపారం చేసే వారి ద్వారా హైదరాబాద్ కు చెందిన గోపాల్ ఆనే వ్యక్తి పరిచయం అవుతాడు. అలా నేను కూడా సొంతంగా గంజాయి వ్యాపారం చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించుకుందామని గత రెండు నెలల క్రితం రెండు సార్లు గంజాయి ని తక్కువ ధరకు కొని ఆటొ ద్వారా హైదరాబాద్ లోని గోపాల్ కు పంపినానని, తరువాత అతను నాకు కొన్ని డబ్బులు ఇవ్వవలసి ఉండగా ఆ యొక్క డబ్బుల గురించి అడగగా మళ్ళీ గంజాయి నువ్వే తీసుకొని వచ్చి మిగతా డబ్బులు తీసుకొని వెళ్ళమని అనడముతో నేను సరేనని ఒప్పుకొని, మా యొక్క ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి గోపాల్ కి ఫోన్ చేయగా అతను హైదరాబాద్ ధూల్ పేట్ కు చెందిన తన స్నేహితుడు చందన్ లకు చెప్పి వారు హైదరాబాద్ తీసుకురావడానికి గాను ఇప్పి శివ అనే డ్రైవరు ను స్కోడా కారును ఇచ్చి మల్కన్ గిరి కి వచ్చి కార్లో లోడ్ చేసుకొని వచ్చే క్రమంలో పోలీస్ వారు పట్టుకోకుండా బైక్ పై శంకర్ పైలటింగ్ వస్తూ చందన్ కి తెల్సిన వ్యక్తైన రాజ్ కుమార్ ఖమ్మం లో వచ్చి నీకు తోడుగా ఖమ్మం నుండి హైదరబాద్ వరకు వస్తాడు అని చెపుతాడు. ఆ తరువాత శంకర్,రాజకుమార్ బైక్ పై కారుకు పైలటింగ్ చేస్తూ వస్తుండగా, మిర్యాలగూడ శివారులో టోల్ వద్ద వాహన తనిఖీలో పట్టుబడగ వీరి వద్ద నుండి ఒక కారు,బైక్,3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండు కు పంపనైనది.
1) మాజీ శంకర్ S/o తతారావు వయస్సు: 27 సంవత్సరాలు, Occ: అర్గిల్., R/o అల్లూరి కోట గ్రామం
చిత్రకొండ మండలం, ఒడిశా రాష్ట్రం.
2) బండి రాజ్ కుమార్ s/o లేట్ యాదగిరి వయస్సు 23 సంవత్సరాలు, Occ: కూలీ r/o BDL కాలనీ, అర్నోధ్యా నగర్, హయాత్నగర్.
3) ఈపి శివ S/o తాఠారావు వయస్సు 24 సంవత్సరాలు, Occ: డ్రైవర్ R/o మాడపేట గ్రామం
మరియు మండలం తూర్పుగోదావరి జిల్లా.
1. గోపాల్ @ సాయి R/o ధూల్‌పేట, హైదరాబాద్. (పరారీలో)
2. చందన్ R/o ధూల్‌పేట ఆఫ్ హైదరాబాద్. (పరారీలో)
రెండవ కేసు:
మిర్యాలగూడ I టౌన్ PS కేసు వివరాలు (Cr.No.176 /2022 u/s 8© r/w 20(b)(ii) (c) of NDPS చట్టం, 1985)
26-08-2022న ఉదయం మిర్యాలగూడ I టౌన్ పోలీసులు జిల్లా టాస్కఫోర్స్ బృందం సమన్వయంతో మిర్యాలగూడ I టౌన్ PS పరిధిలోని ఖలీల్ దాబా సమీపంలోని అద్దంకి-నార్కెట్‌పల్లి హై-వే లో వాహన తనిఖీలు నిర్వహించగా, రెండు కార్లు, ఒక డీసీఎం వాహనం ఆపి తనికి చేయగా వారి వద్ద AP 03 TB 2444 నంబర్ గల DCM లో 150 గంజాయి ప్యాకెట్ల మరియు రెండు కార్లు AP 39 HD 3165 (స్విఫ్ట్ డిజైర్), TS 07 EA 0322 (స్విఫ్ట్ డిజైర్) వాహనాలను వెతకగా ఒక్కో కారులో 20 ప్యాకెట్ల గంజాయి ఉన్నట్లు గుర్తించి. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుని వెంటనే, వారిని పట్టుకుని విచారించగా, 190 గంజాయి ప్యాకెట్ల ను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీరేష్ r/o బీదర్‌కు సరఫరా చేస్తున్నాము అని DCM యజమాని అయిన జన్వదేకర్ ప్రశాంత్ చెప్పుతాడు ఇతని వద్ద DCM డ్రైవర్ గా పని చేసే రాజు కు రాజమండ్రి కి చెందిన కోమలి అనే వ్యక్తి పరిచయం ద్వారా అక్కడ తక్కువ దరకు గంజాయి కొని ఎక్కువ దరకు అమ్మలనే ఉద్దేశంతో ప్రశాంత్, రాజులు రాజమండ్రి కి వెళ్ళిగా అక్కడ కోమలికి తెలిసిన బుడ్డ వెంకటేష్, శ్రీరామ్ చంద్రకాంత్, MD లతీఫ్ మరియు సంతోష్‌లతో పరిచయం చేస్తాడు. వీరందరూ కలిసి వైజాగ్ దగ్గర సీలేరు ప్రాంతంలో రామారావు అనే వ్యక్తి దగ్గర ఒక్కో ప్యాకెట్ 2000 రూపాయలకి కొనుగోలు చేసి డి.సి.యం లో 150 గంజాయి ప్యాకెట్లు రెండు కార్లలో 40 గంజాయి ప్యాకెట్లని లోడే చేసుకొని రాజమండ్రి నుండి హైద్రాబాద్ మీదిగా కర్నాటక రాష్ట్రానికి తరలించే క్రమంలో యన్.హెచ్ 65 హైవే నుండి వెళ్తే పోలీసు తనికిలు ఉంటాయని బావించి మిర్యాలగూడ మీదిగా వస్తూ పట్టుబడుతారు ఈ క్రమంలో కోమలి, రాజు కారు నుంచి పరారవ్వగ మిగతవారిని పట్టుకొని రిమాండుకు పంపనైనది.
1) MD. లతీఫ్ S/O యాకూబ్, వయస్సు: 25 సంవత్సరాలు, Occ: డ్రైవర్, R/O: ఉండ్రాయ్ గ్రామం, కొడకనుల మండలం, జనగాం జిల్లా.
2) బుడ్డ వెంకటేష్ S/O ఏడుండలు, వయస్సు: 36 సంవత్సరాలు, Occ: క్యాబ్ డ్రైవర్, R/O క్వారీమార్కెట్, సుబ్బారావు నగరం, రాజానగరం, తూర్పుగోదావరి జిల్లా.
3) వాంక్‌డోత్ సంతోష్ S/O రణజ, వయస్సు: 19 సంవత్సరాలు, Occ: డ్రైవర్, R/O పెదబాయి తండా, లక్షవంకపల్లి గ్రామం, కొడకనుల మండలం, జనగాం జిల్లా.
4) శ్రీరామ చంద్రకాంత్ S/O ఝాన్ బాన్, వయస్సు: 27 సంవత్సరాలు, Occ: డ్రైవర్, R/O బొమ్మూరు, రాజమండ్రి
5) జాన్వాడేకర్ ప్రశాంత్ S/O మాణిక్ రావు, వయస్సు: 37 సంవత్సరాలు, Occ: డ్రైవర్ మరియు యజమాని DCM, R/O ఠాణా కుష్నూర్ గ్రామం, కమల్ నగర్ మండలం, బీదర్ జిల్లా, కర్ణాటకరాష్ట్రం.
1. రామారావు @ చంటి, వైజాగ్ R/o సైలేరు. (పరారీలో)
2. కోమలి R/o ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రి. (పరారీలో)
3. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీరేష్ r/o బీదర్. (పరారీలో)
4. రాజు r/o ఉదయగిరి కర్ణాటక (పరారీలో)
ఈ కేసు ను ఛేదించిన డి.యస్.పి మొగిలయ్య, మిర్యాలగూడ డి.యస్.పి వెంకటేశ్వర్ రావు గారి పర్యవేక్షణలో సి.ఐ లు సత్యానారాయణ,రాఘవేందర్,యస్.ఐ లు నరసింహులు, శివ తేజ మరియు టాస్క్ పోర్స్ సిబ్బందిని యస్.పి గారు అబినందించారు.