కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు**జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి



కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు**

 *బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు..* 

 *జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ.పి.యస్* 



ఈ రోజు జిల్లా పోలీస్  కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపర్డెంట్ లకు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు, కానిస్టేబుల్  ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు  పై  " అవగాహన కార్యక్రమం" నిర్వహించిన జిల్లా యస్.పి.


ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారూ మాట్లాడుతూ ఆగస్టు 28  ఆదివారం నాడు నిర్వహించబోయే కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షను పకడ్బంధిగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 33327  మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిలిమినరీ రాత  పరీక్షకు హాజరుకారున్నారని తెలిపారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఇందులో నల్లగొండ పట్టణంలో 62 పరీక్షా కేంద్రాలు నకిరేకల్ పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలు మిర్యాలగూడ పట్టణంలో 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట నిర్వహించడం జరుగుతుందన్నారు.  అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు  చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే (ఉదయం 9 గంటలకు) పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరుగుతుందని సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని అన్నారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా హాల్ టికెట్లో పొందపరచి ఉంటాయని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు హాల్ టికెట్ లోని నిబంధనలు చదువుకోవడం మర్చిపోవద్దని, పరీక్ష హాలు లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి ఉండదని, చేతులకు గోరింటాకు , మేహంది వంటివి పెట్టుకోవడం వలన బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గోరింటాకు, మెహంది, వంటివి పెట్టుకో రాదని సూచించారు.  అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరనీ,సెల్ ఫోన్లు, వాచ్ లు(చేతి గడియారాలు) ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలగునవి ఎవరు తీసుకురాకూడదని తెలిపారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా అమలు చేయబడతాయని తెలిపారు. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అభ్యర్థులు గుర్తించాలని ,ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సూచించారు.   బయోమెట్రిక్ ఉపయోగించి పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు  ఒకటికి రెండుసార్లు పరీక్ష కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లోనికి అభ్యర్థులు చీప్ సూపర్డెంట్ లకు, అబ్జర్వర్లకు,  బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు,  మరియు ఇన్విజిలేటర్లకు మాత్రమే అనుమతి ఉందని  తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ యస్.పి ఓ.యస్.డి ఆశ్వాక్  డి. యస్.పి లు నరసింహ రెడ్డి,వెంకట రమణ,సురేష్ కుమార్ మరియు చీప్ సూపర్ండెంట్లు, బి.నాగరాజు, కే.చంద్ర శేఖర్  అబ్జర్వర్లు,  బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఇన్స్పెక్టర్లు సత్యం, చంద్రశేఖర్ రెడ్డి,గోపి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కృష్ణా రావు,శ్రీను ఐటీ సెల్ ఎస్ఐ నాగరాజు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...