హైదరాబాద్ రోడ్డు
అండర్ బ్రిడ్జ్ వైండనింగ్ వివాదం...
ఇప్పటికే పలుమార్లు రైల్వే GM, ఇతర ఉన్నతధికారుల కు..అండర్ బ్రిడ్జ్ వెడల్పునకు విజ్ఞప్తి...
ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రస్తుతం రోడ్డు విస్తరణ కు సమానంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ వెడల్పు చేయాలనీ.. కోరిన mla
సమస్యను పట్టించుకోకుండాయధావిధిగా పనులను ప్రారంభించడం పట్ల..
రైల్వే ఉన్నతాధికారుల పై కంచర్ల తీవ్ర ఆగ్రహం...
జిల్లా కలెక్టర్ తో కలిసి అండర్ బ్రిడ్జ్ పరిశీలన
సమస్యను జిల్లా కలెక్టర్ కు వివరించి తక్షణమే.. రోడ్డు విస్తరణ కు.. అనువుగా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలనీ మనవి.
నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు... జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారి తో కలిసి.. వివాదాస్పదంగా మారిన హైదరాబాద్ రోడ్ అండర్ రైల్వే బ్రిడ్జ్ పరిశీలించారు..
ప్రస్తుతం నల్లగొండలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్న విషయం తెలిసిందే.. హైదరాబాద్ రోడ్ లో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జ్ ను... ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు విస్తరణకు సమాంతరంగా.. బ్రిడ్జి వెడల్పు పెంచాలని, పనుల ప్రారంభానికి ముందే, రైల్వే జనరల్ మేనేజర్... నల్లగొండ సందర్శించిన సందర్భంగా సమస్యను వారి దృష్టికి తీసుకు పోయి రోడ్డు విస్తరణ కు సమానంగా 11 మీటర్ల వెడల్పు తోరెండు వైపులా.. అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని పిటిషన్ తో విజ్ఞప్తి చేసారు..రాజ్యసభ సభ సభ్యులు
ప్రజాప్రతినిధి గా తాను చేసిన విజ్ఞప్తి ని విస్మరించి... అత్యంత ట్రాఫిక్ ఉండే ఇటువంటి ప్రాంతములో ... ఇరుకైన బ్రిడ్జి నిర్మాణం వల్ల.. ప్రమాదాలు జరిగి.. వాహనదారులప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని..తక్షణమే ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు విస్తరణ కు అనుగుణంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని... కంచర్ల విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని పరిశీలించారు..
అనంతరం కలెక్టర్ చాంబర్ లో రైల్వే ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమావేశం లో సమస్యను పరిష్కరించే విదంగా వెంటనే చర్యలు తీసుకోవసిందిగా కలెక్టర్ రైల్వే అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కనగల్ ఎంపీపీ కరీం పాషా,పట్టణ పార్టీ అధ్యక్షలు, పిల్లి రామరాజు యాదవ్,ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ కౌన్సిలర్ లు జెరిపోతుల భాస్కర్ గౌడ్, వట్టిపల్లి శ్రీనివాస్, నాయకులు, సింగం రాంమోహన్,బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి,అధికార ప్రతినిధి, సంధినేని జనార్దన్ రావు, కనగల్ పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్యరావుల శ్రీనివాస రెడ్డి ,మల్లేష్ గౌడ్,ఊటుకూరు సందీప్ రెడ్డి గంజి రాజేందర్, తలారి యాదగిరి కందుల లక్ష్మయ్య,ముత్తినేని నాగేశ్వర్ రావు నాగరాజు,హన్ను తదితరులు వెంట ఉన్నారు.