24 గంటల్లో  దారి దోపిడీ కేసును చేదించిన ఐజ పోలీసులు

 PRESS


*24 గంటల్లో  దారి దోపిడీ కేసును చేదించిన ఐజ పోలీసులు


*.

*తొమ్మిది మంది అరెస్టు- Rs. 30,000/- నగదు, తొమ్మిది సెల్ఫోన్లు మరియు స్కార్పియో వాహనం స్వాధీనం*.


*మీడియా సమావేశంలో లో వివరాలు వెల్లడించిన ----జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు*


*వివరాలు*: విశ్వసనీయ సమాచారం మేరకు తేదీ 13-2-2022 సాయంత్రం నాలుగు గంటలకు మేడికొండ X రోడ్డు వద్ద ఐజ పోలీసులు తొమ్మిది మంది అంతర్రాష్ట్ర దారిదోపిడి ముఠాను అరెస్టు చేసి వారు దోచుకున్న Rs. 30,000/- నగదు, వారు నేరంలో ఉపయోగించిన స్కార్పియో వాహనం మరియు 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడ మైనది.

కేసు వివరాలు

          తేదీ 12. 2.2022 నాడు అందాజ  మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఆయిల్ నాయక్ రామకృష్ణ S/o  ఆయిల్ నాయుడు, వయస్సు: 59 సంవత్సరములు కులం: నాయుడు వృత్తి: హోల్ సేల్ బట్టల వ్యాపారం  R/o తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం తిరుచి జిల్లా అను అతను పోలీస్ స్టేషన్ కు  వచ్చి దరఖాస్తు ఇచ్చిన విషయం ఏమనగా, సదరు ఆయిల్ నాయుడు రామకృష్ణ గత 20 రాయచూరు పట్టణంలోని వివిధ బట్టల దుకాణాలు హోల్ సేల్ బట్టలు అనగా అడ్డపంచలు, దోతులు మరియు  టవల్స్ చేనై లో కొని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ కు తీసుకొచ్చి  అమ్ముతుంటాను, తేదీ 11-02-2022  ఉదయము అందాజ 9 గంటలకు రాయచూరు పట్టణానికి వచ్చి హోల్సేల్ బట్టల షాపులకు  బట్టలు వేసి  వచ్చిన డబ్బులు 30,000 నగదు తీసుకొని ఈరోజు తేదీ 12. 2. 2022 మధ్యాహ్నం 12 గంటల సమయంలో నేను తమిళనాడుకు  వెళ్లడం కోసం రాయచూర్ లో గల బస్టాండ్ కి వెళ్లి కర్నూలు వెళ్లే బస్సు ఎక్కినాను.  అందాజ మధ్యాహ్నం 13:00  గంటలకు ప్రాంతంలో అయిజ పట్టణానికి బస్  రాగా బస్ డ్రైవర్ భోజనం కొరకు జంక్షన్ లో ఆపినాడు, అప్పుడు బస్సు లో ఉన్న కొంత మంది ప్రయాణికులు కూడా దిగినారు. అప్పుడు నేను కూడా టీ తాగడానికి 30 వేల రూపాయల నగదు గల బ్యాక్ పట్టుకొని బస్సు దిగుతుండగా నాతో పాటుగా నా చుట్టుపక్కల కూర్చున్నా  ఏడు మంది వ్యక్తులు నన్ను చుట్టుముట్టి, నన్ను చేతులతో కొట్టి డబ్బులు  ఉన్న నా లగేజి బ్యాగు  ను గుంజికొని  నన్ను బస్సు మెట్ల దగ్గర కిందకు దొబ్బగా నేను కింద పడినాను. దీనివల్లన నా కుడి చేయి కి మోచేతి దగ్గర గాయం అయినది, నేను లేచి వారి వెంట పడగా అట్టి ఏడుగురు నగదు తో  ఉన్న నా లగేజి జీన్స్ క్లాత్ బ్లూ కలర్ బ్యాగ్ ను తీసుకొని బస్సు వెనుకాల ఉన్న స్కార్పియో కార్ MH-13-BN-2931 నెంబర్ గల దానిలో ఎక్కి నారు. ఆ కార్ లో  వీరి  తో పాటు డ్రైవర్ సీట్ లో ఒక్కరు మరియు డ్రైవర్ పక్క సీట్ లో మరొక్కరు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు.  వీరందరూ అట్టి  కార్ లో పారిపోయినారు  అని ఫిర్యాదు ఇవ్వగా క్రైమ్  నెంబర్ 24/2022 U/S 395 IPC లో కేసు నమోదుచేసినాము.  





*ముద్దాయిల వివరాలు*.

A1) బాబాన్ పటేకర్  s/o సిటిబార్  పటేకర్ వయస్సు: 55 సంవత్సరాలు కులం వడ్డెర occp కూలీ R/o    కాగవవీళ్ళ గ్రామం,  కార్గో తాలూకా మహారాష్ట్ర రాష్ట్రం 

A2) బాబాన్ అన్న పిటికర్ s/o  అన్న పిటికర్  వయసు: 60  కులం: వడ్డిరా  వృత్తి; వ్యవసాయం  r/o  మహాలంగి  గ్రామం,  కరజీత్  తాలూకా,  మహారాష్ట్ర రాష్ట్రం 

A3) సాకారం  దీకలి సూరగి రావు s/o  సాకారం, వయసు: 45   కులం: వడ్డిరా  వృత్తి; కూలీ r/o  లావూల్  గ్రామం,  మడ తాలూకా సోలాపురం జిల్లా 

A4) రామేశ్వరు  అంబాదాస్  s/o  అంబాదాస్  జాదవ్, వయసు: 24   కులం: టకిరీ,   వృత్తి; కూలీ r/o  షీరాపు గ్రామం, బీడు జిల్లా 

A5) పర్వీన్ లక్ష్మణ్ గుంజలు s/o లక్ష్మణ గుంజలు, వయసు: 28    కులం: వడ్డెర ,   వృత్తి; వ్యవసాయం  r/o  షీరాపు గ్రామం, బీడు జిల్లా 

A6) అరుణ్ లక్ష్మణ్ గుంజలూ s/o లక్ష్మణ్ గుంజల వయసు: 29 కులం: వడ్డెర , వృత్తి; వ్యవసాయం  r/o  బార్లోని  గ్రామము  సోలాపురం జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం 

A7) నగేష్ పవర్ s/o బారకు పవర్  వయసు: 31   కులం: వడ్డెర , వృత్తి; కూలీ   r/o  పాతరది గ్రామము అహమాదనగర్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం  

A8) సుకలే విలాస్ శామ్ రావు s/o శామ్ రావు వయసు: 36  కులం: వడ్డెర , వృత్తి; కూలీ R/o  వారకుటి గ్రామము, కమల తాలూకా,  సోలాపురం జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం  

A9) యశ్వంత్ ధశరత  గుంజాల్  s/o  ధశరత  గుంజాల్ వయసు: 33  కులం: వడ్డెర , వృత్తి; డ్రైవరు  R/o  బార్లోని గ్రామము  మరియు  తాలూకా, సోలాపురం జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం

నేరము చేసే విధానము

మొదటి ముద్దాయి అయిన బాబన్ పటేకర్ నాయకత్వంలో తొమ్మిది మంది ముఠాగా ఏర్పడి స్కార్పియో వాహనంలో వివిధ రాష్ట్రాలకు సంచరిస్తూ బస్టాండ్ లో కాపు కాచి ధనము కలిగి ఉన్న ప్రయాణికులను/ వ్యక్తులను టార్గెట్ చేసి వారు ప్రయాణించే బస్సులో సుమారు 6 నుండి 7 మంది సభ్యుల ముఠా అదే బస్సులో ఎక్కి అట్టి వ్యక్తిని కవర్ చేస్తూ అతని దృష్టి మరల్చి దొంగలించడం లేదా అదను చూసి అట్టి వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేసి గాయపరచి, బలవంతంగా అతని వద్ద ఉన్న బ్యాగ్ లాక్కొని అట్టి బస్సు దిగి బస్సు ను అనుసరిస్తున్న వారి స్కార్పియో వాహనంలో పారిపోవడం వీరి నేర ప్రవుర్తి.

 *స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు*

1) Rs. 30000/- 

2) తొమ్మిది సెల్ ఫోనులు  

3) ఒక స్కార్పియో కారు మరియు ఫిర్యాదుదారుని బ్లూ కలర్ బ్యాగ్.





*నేరము ను చేదించిన విధానము*

శ్రీ జె. రంజాన్ రతన్ కుమార్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ జోగులాంబ గద్వాల జిల్లా వారి ఆదేశాల మేరకు శ్రీ  N.Ch. రంగస్వామి డిఎస్పి గద్వాల గారి  స్వియ పర్యవేక్షణలో శ్రీ S.G.శివ శంకర్ గౌడ్ సిఐ శాంతినగర్ గారు, శ్రీ నరేష్ ఎస్సై ఐజ పిఎస్, శాంతినగర్, ఐజ మరియు సి.సి.ఎస్ పోలీస్ సిబ్బంది ఐన ప్రభాకర్,  మాభాష, యాకోబు ఉసేన్, వెంకప్ప, విజయ రాజు, శ్రీనివాసులు, హెచ్.సి భాస్కర్ రెడ్డి , రంజిత్ ల సహయంతొ, తేదీ 13-2-2022 సాయంత్రం నాలుగు గంటలకు మేడికొండ X రోడ్డు వద్ద రాయచూరు వెళ్తున్న స్కార్పియో వాహనం నెంబర్ MH-13-BN-2931  Intercept చేసి తొమ్మిది మంది ముద్దాయిలను అరెస్టు చేసి  వారి వద్దనుండి దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకొని తదుపరి అట్టి ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తున్నాము. ఇట్టి కేసులో ప్రతిభ కనబరిచిన ఆఫీసర్లకు మరియు సిబ్బంది కి జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలిపి రివార్డ్స్ ప్రకటించడం అయినది.

ఈ కార్యక్రమంలో డి. ఎస్పీ శ్రీ N. Ch రంగా స్వామి గారు, శాంతినగర్ సి. ఐ శివ శంకర్ గారు, ఐ జ ఎస్సై నరేష్ గారు, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.


PRO

District Police Office

Jogulamba Gadwal District.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...