డిండి ఎత్తిపోతల పథకం,ఏ.యం.ఆర్.పి.ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లు,కెనాల్ ల భూ నిర్వాసితుల కు నష్ట పరిహారం జాప్యం లేకుండా పంపిణీ త్వరగా పూర్తి చేయాలని,ఆర్&ఆర్ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ ఆదేశించారు.

 నల్గొండ,నవంబర్ 17. డిండి ఎత్తిపోతల పథకం,ఏ.యం.ఆర్.పి.ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లు,కెనాల్ ల  భూ నిర్వాసితుల కు నష్ట పరిహారం   జాప్యం లేకుండా పంపిణీ త్వరగా పూర్తి చేయాలని,ఆర్&ఆర్ పనులు వేగవంతం చేయాలని  అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ ఆదేశించారు


.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో     డిండి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న  శివన్న గూడెం,క్రిష్ణ రాయిని పల్లి,గొట్టి ముక్కల ప్రాజెక్ట్ ,చింత పల్లి,సింగ రాజు పల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లు,డిండి మెయిన్ కెనాల్,కెనాల్  ల కారణంగా భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు నష్ట పరిహారం, ఆర్&ఆర్ పనులు సమీక్షించి, నష్ట పరిహారం భూ నిర్వాసితులకు త్వరగా పూర్తి చేసి,ఆర్&ఆర్ పనులు వేగంగా పూర్తి చేయాలని,కాలనీ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఏ.యం.ఆర్.పి.కింద డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయ సముద్రం, పెండ్లి పాకల,, ధర్మారెడ్డి, పిల్లాయి పల్లి కాల్వ భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఆర్&ఆర్ కాలనీ ల ఏర్పాటు వేగవంతం చేయాలని,   గొట్టి ముక్కల ఆర్&ఆర్ కాలనీ పనులు ఏర్పాటు వేగవంతం చేయాలని, క్రిష్ణ రాయిని పల్లి,శివన్న గూడెం,పెండ్లి పాకల, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆర్&ఆర్ ప్రతి పాదనలు త్వరితగతిన సమర్పించాలని అన్నారు. ఈ సమావేశం లో నల్గొండ  ఆర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి,దేవరకొండ ఆర్.డి.ఓ.గోపిరాం,మిర్యాలగూడ ఆర్.డి.ఓ.రోహిత్ సింగ్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...