పురపాలక సంఘం మిర్యాలగూడ ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్ లకు మంగళవారం
మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ భార్గవ్ తిరు నగరు గారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అసంఘటిత రంగ కార్మికులు E-SHRAM కార్డ్ పన్నెండు రూపాయలు పెట్టి తీసుకున్నట్లయితే వారికి ఇన్సూరెన్స్ రూపాయలు రెండు లక్షల రూపాయలు మంజూరు అవుతుంది అన్నారు అందుకే మెప్మా రిసోర్స్ పర్సన్ పట్టణంలోని అసంఘటిత రంగ కార్మికుల గురించి వారి తో ఇన్సూరెన్స్ చేయించాలన్నారు ప్రధానమంత్రి ఫైనాన్స్ micro enterprises ద్వారా మహిళా సంఘంలోని ప్రతిభావంతులైన వ్యక్తిగత ఉత్పత్తులను తయారు చేసే వారిని గుర్తించి PMFME ద్వారా అప్లై చేస్తే వారికి రూపాయలు 40 వేల రూపాయలు ఎస్ ఎల్ ఎఫ్ ద్వారా మంజూరు అవుతాయని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ మెప్మా టిఎంసి బక్కయ్య సి ఓ లు శ్రీనివాస్ వెంకటేశ్వర్లు రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు