రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అన్ని చర్యలు : డిఐజి రంగనాధ్*

 *రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అన్ని చర్యలు : డిఐజి రంగనాధ్*


- - రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్స్, ఫ్లెక్సీల ఆవిష్కరించిన డిఐజి

- - జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు


నల్లగొండ : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు.


32వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తామని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని అన్ని స్కూళ్లకు, కాలేజీలకు పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది వెళ్లి రోడ్డు ప్రమాదాలు, మోటార్ వాహనాల చట్టాల గురించి అవగాహన కల్పించడం కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా వాహనదారులు సహకరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాలు ఆసరా కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలు సందర్భాలలో మానవ తప్పిదాలు, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు నివారణపై, తీసుకోవాల్సిన చర్యలపై  సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా గుర్తించిన అన్ని ప్రాంతాలలో బొల్ రాడ్స్, స్టాపర్లు, పెయింటింగ్, ప్లాస్టిక్ కోన్స్, సీసీ కెమెరాల లాంటి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వల్ల జరుగుతున్నట్లుగా గుర్తించి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, స్పీడ్ లేజర్ గన్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.


జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి ఆయన సూచించారు.


కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిటిఆర్బీ స్పెషల్ ఆఫీసర్ అంజయ్య, ఆర్.ఐ. నర్సింహా చారి, ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్, ఐటీ సెల్ సిఐ గోపి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్, 

తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...