బీజేపీ నేత నేలవెల్లి రామారావు దారుణ హత్య

 బీజేపీ నేత నేలవెల్లి రామారావు దారుణ హత్య

దాడికి పాల్పడిన ప్రధాన 


నిందితుడు  మాడపాటి రాజేశ్‌ మధిర కోర్టులో లొంగిపోయాడు.


ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ నేత నేలవెల్లి రామారావు దారుణ హత్యకు గురయ్యారు. బీజేపీ ఆర్టీఐ సెల్ కన్వీనర్ రామరావు నివాసానికి శనివారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్స్ ధరించి బైక్‌పై వచ్చారు. 

ఇంట్లోకి చోరబడి అయిదు నిమిషాల వ్యవధిలోనే ఆయనపై కత్తులతో అతి దారుణంగా దాడి చేశారు. ఇంట్లో ఉన్న రామరావు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దాడి చేసిన వెంటనే నిందితులు బైక్‌పై పారిపోయారు. 

 తీవ్రంగా గాయపడిన రామరావును కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

 రామరావు హత్యకు ఆర్థిక లావాదేవిలే కారణంగా తెలుస్తుంది. 

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రామరావు మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ కోనసాగుతుంది. 

 జిల్లా బీజేపీ నేతలు సైతం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. 

మరోవైపు రామరావు హత్య వెనుక రాజకీయ కోణం కూడ ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు  మాడపాటి రాజేశ్‌ మధిర కోర్టులో లొంగిపోయాడు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...