📣📣 *సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గము ఆధ్వర్యంలో ఈ రోజు మే 12 న 600భోజన ప్యాకెట్లు పంపిణీ*📣
*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చకిలం రమణయ్య గారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి శ్రీ కౌటికె విఠల్ గారి పర్యవేక్షణలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆఫీసు ఎదురుగా రాక్ టౌన్ కాలని, ఎల్.బి.నగర్, రాజీవ్ గాంధీ నగర్ లో 300 భోజన పాకెట్స్ పంపిణి చేయడం జరిగినది ఇందులో వామ్ మెంబర్ శ్రీ చింతల బాలరాజు మరియు అధ్యక్షులు చకిలం రమణయ్య గారు పాల్గొన్నారు.*
*అలాగే వామ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ న్యాలమడుగుల మురళి గుప్త ఆధ్వర్యములో 300 భోజన ప్యాకెట్లు చాదర్ ఘాట్ సాయిబాబా మందిరం వద్ద మరియు నాంపల్లి స్టేషన్ వద్ద పంపిణి చేసారు. ఈ కార్యక్రమములో ప్రధాన కార్యదర్శి కౌటికె విఠల్ మరియు తరుణ్ పాల్గొన్నారు.*
*మన ముఖ్యమంత్రి KCR గారు కరోనా కట్టడి చేయడానికి చేస్తున్న పని తీరును మా సంస్థ ద్వారా వారికి శతకోటి వందనాలు తెలుపుతున్నాము. ఈ కష్ట సమయంలో తమ ప్రాణాలకు తెగించి దేశానికి ఎంతగానో సేవ చేస్తున్న పోలీస్ సోదరులకు డాక్టర్లకు నర్సులకు రెవెన్యూ సిబ్బందికి మీడియా మిత్రులకు పారిశుద్ధ్య సిబ్బందికి మరియు విద్యుత్ శాఖ వారికి మా ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర విభాగం తరఫున పాదాభివందనాలు తెలియచేస్తు*
🙏🙏🙏🙏
*చకిలం రమణయ్య* అధ్యక్షులు
*కౌటికె విఠల్* ప్రధాన కార్యదర్శి
*మురం శెట్టి శ్రీనివాస్* ట్రెజరర్.