ఉప్పల ఫౌండేషన్ అపన్న హస్తం
ఫౌండేషన్ ఆపన్న హస్తం
మనసురాబాద్ డివిజన్ లోని వలస కార్మికులకు ఉప్పల ఫౌండేషన్ ఆపన్న హస్తం అందించింది. రెక్కాడితే గానీ డొక్కాడని వారంతా లాక్ డౌన్ తో పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తగారు నిత్యావసరాలు అందించారు. ఉప్పల ఫౌండేషన్ తరపున బియ్యం, కందిపప్పు, మంచినూనె, మిర్చి పౌడర్. ఉప్పు. పసుపుతో పాటు భోజనం ఏర్పాటు చేసి బిర్యానీ ప్యాకెట్లు అందించారు. కోవిడ్ రక్షణలో భాగంగా మాస్కులు అందజేసారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చు శ్రీనివాసు, ఐవిఎఫ్ పొలిటికల్ కమిటీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి కన్వీనర్ అర్చన సేనాపతి, ఐవిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అదేంటి రవికుమార్, పిఆర్ఓ చింతల రజనీకాంత్ టీజేఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు