*బాదితులకు సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ లక్ష్యం : ఎస్పీ రంగనాధ్*
నల్లగొండ : అనేక రకాల సమస్యలతో వచ్చే ప్రజలకు, బాధితుల పక్షాన నిలిచి వారికి సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యమని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ ద్వారా వచ్చే దరఖాస్తులతో పాటు సాదారణ రోజులలోనూ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తులను మొత్తం సెంట్రల్ ఫిర్యాదుల విభాగం ద్వారా కంప్యూటర్ లో పొందుపరుస్తూ వాటిని పర్యవేక్షిస్తూ పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా పోలీస్ శాఖ పని చేస్తున్నదని చెప్పారు. ఇకపై ఫిర్యాదుల విభాగాన్ని మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా అర్జీ దారులతో సమావేశాలు నిర్వహించి వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ద్వారా పని విధానంలో మార్పు తీసుకువస్తూ పోలీస్ శాఖ గౌరవం పెంచే విధంగా పని చేయానున్నట్లు ఆయన చెప్పారు.