*గ్రీవెన్స్ డే లో వచ్చిన పిర్యాదులు ప్రాధాన్యత నిచ్చి వారంలో పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్**


 *గ్రీవెన్స్ డే లో వచ్చిన పిర్యాదులు ప్రాధాన్యత నిచ్చి వారంలో పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*





*గ్రీవెన్స్ డే లో వచ్చిన పిర్యాదులు ప్రాధాన్యత నిచ్చి వారంలో పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*


* *గ్రీవెన్స్ డే కు జిల్లా అధికారులు తప్పక హజరు కావాలి*
* *ప్రజా వాణి పెండింగ్ పిర్యాదు ల పై ప్రతి వారం సమీక్ష*
నల్గొండ: ప్రజల నుండి అందిన పిర్యాదులు అత్యంత ప్రాధాన్యత నిచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరం లో అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ తో కలిసి అధికారులను సమావేశ పరిచి జిల్లా కలెక్టర్ పిర్యాదులు స్వీకరించారు.వివిధ శాఖల కు సంబంధించి వచ్చిన పెండింగ్ లో నున్న పిర్యాదులు వారం రోజుల్లో పరిశీలించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.గ్రీవెన్స్ డే లో వచ్చిన పిర్యాదులు పై కింది స్థాయి అధికారులు కాకుండా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు ప్రతి పిర్యాదు ను స్వయంగా పరిశీలించి క్రమ పద్దతి లో పరిష్కారం చేయాలని సూచించారు.ఒక వేళ పరిష్కారం చేయక పోతే కారణాలు తెలుపుతూ పిర్యాదు దారుని కి రాత పూర్వకంగా తెలియ చేయాలని ఆయన తెలిపారు.గ్రీవెన్స్ డే లో పిర్యాదులు పరిష్కారం కేవలం రొటీన్ పద్దతి లో కాకుండా జిల్లా అధికారులు దృష్టి సారించి నాణ్యతగా పరిష్కారం చేయాలని అన్నారు.ప్రతి సోమ వారం గ్రీవెన్స్ డే ప్రజా వాణి కార్యక్రమం కు జిల్లా అధికారులు హజరు కావాలని, ఎవ్వరికి మినహాయింపు లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.గ్రీవెన్స్ డే కు రాని అధికారుల కు మెమో లు జారీ చేసి సంజాయిషీ అడగాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతి లాల్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళ వారం ఎక్కువ సంఖ్య లో పెండింగ్ లో నున్న శాఖల పిర్యాదులు పై జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లు ఉదయం 3 శాఖ లు,మధ్యాహ్నం 3 శాఖలు కు సంబంధించి సమీక్షించ నున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ ట్రాన్స్ కో,ఎక్సైజ్ ,సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జిల్లా కో ఆర్డినేటర్,జిల్లా సంక్షేమ శాఖ అధికారి, మైనింగ్, మాడా,కార్మిక శాఖ,వికలాంగుల శాఖ , ఈ ఈ కాలుష్య నియంత్రణ శాఖల కు సంబంధించి పిర్యాదులు పరిష్కారం,ఎటువంటి పిర్యాదులు వస్తున్నాయి ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రతి వారం గ్రీవెన్స్ లో వచ్చిన పిర్యాదులు పరిష్కారం పై సమీక్ష చేయ నున్నట్లు తెలిపారు.గ్రీవెన్స్ లో ఎక్కువ గా మళ్లీ మళ్లీ పిర్యాదు దారులు వినతి పత్రాలు ఇస్తున్నారని ఆయన అన్నారు.ప్రతి పిర్యాదు ను జిల్లా అధికారి పరిశీలించి పరిష్కారం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,నల్గొండ అర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...