పోలింగ్ స్టేషన్స్ లో నేర చరితులను పోలింగ్ ఏజెంట్లుగా పెట్టవద్దు : ఎస్పి రంగనాథ్

*నేర చరితులను పోలింగ్ ఏజెంట్లుగా పెట్టవద్దు : ఎస్పీ రంగనాధ్*
- - పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో సహకరించాలి


నల్గొండ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో నేర చరిత్ర ఉన్నవారిని పోలింగ్ ఏజెంట్లుగా పంపించవద్దని రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఎస్పీ రంగనాధ్ సూచించారు.


మంగళవారం ఉదయం ఎన్.జి. కళాశాల మైదానంలో ఎన్నికల విధుల నిర్వహణకు వెళ్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉదయం 7.00 గంటల నుండి 5.00 గంటల వరకు జరగనున్న పోలింగ్ ప్రక్రియలో ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతించడం జరుగుతుందని చెప్పారు. పోలింగ్ ఏజెంట్లుగా నేర చరిత్ర కలిగిన వారిని అనుమతించడం జరగదని చెప్పారు. పోలింగ్ బూత్ లలోకి సెల్ ఫోన్ అనుమతించడం జరగదని ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పటిష్టమైన భద్రత నడుమ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పిన ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు.


ఎస్పీ రంగనాధ్ వెంట అదనపు ఎస్పీ సి.నర్మద, ట్రైనీ ఐపీఎస్ వైభవ్ గైక్వాడ్, నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐలు సురేష్, బాషా, రాజశేఖర్ గౌడ్, ఆర్.ఐ.లు ప్రతాప్, నర్సింహా చారి, ఎస్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులున్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...