రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం ఎస్పీ రంగనాథ్

*రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎల్.ఇ.డి. స్క్రీన్ తో అవగాహన కార్యక్రమాలు : ఎస్పీ రంగనాధ్*
- - జాతీయ రహదారుల వెంబడి ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి
- - రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు
- - రోడ్డు ప్రమాదాల వీడియోలు, అవగాహనా కోసం ఎల్.ఇ.డి.తో కూడిన వాహనం ద్వారా ప్రచారం


నల్గొండ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.


జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్.ఇ.డి. స్క్రీన్ కలిగిన వాహనాన్ని ఆయన గురువారం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లే రహదారుల వెంట ఉన్న కంప చెట్లు, పొదలను తొలగించడం ద్వారా వాహనదారులకు సరిగా కనపడే విధంగా, రోడ్డు మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాలలో జరిగిన ప్రాణనష్టం, కుటుంబాల పరిస్థితులను అందరికి అర్ధం అయ్యే విధంగా వివరించడానికి ఎల్.ఇ.డి. స్క్రీన్ తో ప్రజలకు అవగాహన కల్పించడం లక్ధ్యంగా ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జాతీయ రహదారులకు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా అవగాహన కల్పించడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.


కార్యక్రమంలో డిటిఆర్బీ సిఐ అంజయ్య, ట్రాఫిక్ ఎస్.ఐ. కొండల్ రెడ్డి, సిబ్బంది కార్తీక్, ఆఫ్రోజ్, శ్రీరామ్, రియాజ్ తదితరులున్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...