ప్రజల రక్షణ కోసం నిరంతరం పోలీసులు: ఎస్పీ రంగనాథ్

నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం నల్గొండ ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో శ్రీరాంనగర్ కాలనీ దేవరకొండ రోడ్డు నందు పోలీస్ కళాబృందంచే ఐటి మరియు సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన సదస్సు  ఏర్పాటు చేయడం జరిగింది 
కార్యక్రమంలో నల్లగొండ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొని పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజా రక్షణ కోసం నిరంతరం పోలీసులు అండగా ఉన్నారని చెప్పారు. ఎలాంటి సమస్య వచ్చినా డయల్ 100 కు పిర్యాదు చేస్తే సత్వరం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. షీటీం నల్గొండ , మరియు నల్గొండ వన్టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.


కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్, మహిళలు, విద్యార్థినీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...