జిల్లా డీఈవో కార్యాలయాల్లో సెక్టోరియల్ అధికారుల నియామకం కొరకు ప్రకటన వెలువడింది

*🔮జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సెక్టోరల్ అధికారుల నియామకానికి ప్రకటన వెలువడింది.*
వెబ్సైటు: *https://tsssarecruitment.aptonline.in/SectoralOfficers/HomePages/HomePage.aspx*
లేదా *samagrashiksha.telangana.gov.in*
విద్యాశాఖ యంత్రాంగాన్ని పటిష్ట పరచడానికి సమగ్ర శిక్ష తెలంగాణ వారు 2015 తరువాత వివిధ కో ఆర్డినేటర్ (సెక్టోరల్ అధికారుల) నియామకానికి ప్రకటన జారీ చేయడం జరిగింది. గతంలో ఉన్న సెక్టోరల్ అధికారుల నే కొత్త పేర్లతో కో ఆర్డినేటర్ లుగా వ్యవహరించడం జరిగింది. :
ఐదేళ్ల బోధన అనుభవం కలిగిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కానీ స్కూల్ అసిస్టెంట్లు గాని ఇట్టి నియామకాల కు అర్హులు.
జిల్లా విద్యాశాఖలో డీ ఈ ఓ తరువాత అత్యంత బాధ్యతలు, అధికారాలు  కలిగిన సెక్టో రల్ అధికారులు ప్రాధాన్యతా క్రమంలో పోస్టుల వారీగా వివరాలు:


*1. సెక్టోరల్ ఆఫీసర్-1:*
*PLANNING& MIS* (జిల్లా ప్రణాళిక, డిజిటల్, ఐసీటీ, ఎం ఐ ఎస్) , MRC ల పై నియంత్రణ)
జిల్లా విద్యాశాఖలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇది. సమగ్ర శిక్షానిధులు, విధులు , పర్యవేక్షణకు స్వయం నిర్ణయాధికారం కలిగి జిల్లా కలెక్టర్ గారికి నివేదించవలసి ఉంటుంది.


*విధులు:👉*  విద్యాశాఖకు చెందిన బడ్జెట్ రూపకల్పన, వివిధ పథకాలకు& పాఠశాలలకు నిధులు కేటాయింపు, సమగ్ర శిక్షలో వివిధ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రతిపాదనలు తయారు చేయడం, నూతన పాఠశాలల (OSC) ఏర్పాటు ప్రతిపాదనలు, అన్నీ రకాల విద్యాశాఖ ఆన్లైన్ అంశాల పర్యవేక్షణ, MRC ఉద్యోగులు మరియు MIS COORDINATORS పై నియంత్రణ, వారి జీతాల పై అధీకృత అధికారం, జిల్లా యందు జరిగే సమగ్ర శిక్షా కార్యక్రమాల రూపకల్పన పర్యవేక్షణ, ఆడిట్ చేయుట, లెడ్జర్ నిర్వహణ, ప్లానింగ్ సమావేశాలు వర్క్ షాపులు CDSE లో హజరగుట, రాష్ట్ర కార్యాలయం తో ప్రత్యక్ష సంబంధాలు, డి పీ ఓ (డీ ఈ ఓ) కు అన్నివిషయాల్లో సహకారం, డీ. పి. ఓ స్థాయి అధికారాలు బాధ్యతలు 


*వసతులు👉:* సహాయకులుగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ -1, ప్లానింగ్ సమావేశాలు, వర్క్ షాప్ నిర్వహణలో MIS (2-3) లు, ప్రత్యేక సమావేశాలు హజరగుటకు వాహన సౌకర్యం (లేనిచో TA &DA), వ్యక్తిగత కంప్యూటర్, ఒక సహాయకులు మరియు ఇతర అలవెన్సులు (శిక్షణా కార్యక్రమాలు నిర్వహంచినపుడు).


*2. 👉సెక్టోరల్ ఆఫీసర్-2:*
*Q.I&O.S.C* (క్వాలిటీ ఇంటర్వెన్షన్, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, ఒకేషనల్ విద్య)
ప్రాధాన్యత క్రమంలో రెండవ పోస్టు. బోధనా నాణ్యత, పర్యవేక్షణకు బాధ్యు లై డీ ఈ ఓ కు నివేదిచవలసి ఉంటుంది. 
*విధులు:* పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అమలయ్యేలా చూడడం, పర్యవేక్షణ, ఉపాధ్యాయ విద్యాపరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, పరిమిత అధికారాలతో కూడిన పర్యవేక్షణ, DPO (DEO) గారికి విద్యా విషయాల సలహాదారు, బడి బయట పిల్లల వివరాలు, RBC పాఠశాలలపై నియంత్రణ., పాఠశాల విద్య కై ప్రధానోపాధ్యాయులతో ప్రత్యక్ష సంబంధాలు, ఎస్ఎంసి పనితీరు పర్యవేక్షణ.
*వసతులు:* శిక్షణ కార్యక్రమాలు నిర్వహంచినపుడు ప్రత్యేక అల వెన్సులు, పర్యటనలకు (TA &DA), 


*3. 👉సెక్టోరల్ ఆఫీసర్-3:* *G.C.D.O* ( జెండర్ ఈక్విటీ) *మహిళలు మాత్రమే అర్హులు*
ప్రాధాన్యతా క్రమంలో మూడవది. స్వీయ నిర్ణయాధికారం, బాధ్యతలు కలిగి జిల్లా విద్యాశాఖ విధులు నిర్వర్తించే బాధ్యతలు కలది.
*విధులు:* జిల్లాలోని బాలికా విద్య పై పూర్తి అధికారాలు, కే జీ బీ వీ లపై పూర్తి నియంత్రణాధికారం, కే జీ బీ వీ నియామకాలు, జీత భత్యాలు, శిక్షణలు, మోడల్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ, జ్యోతిబాఫులే పాఠశాలల (హాస్టల్) విద్యార్థుల బాగోగులు, DPO (DEO) గారికి బాలికావిద్యా విషయాల సలహాదారు, ఇతర సమగ్ర శిక్షా కార్యక్రమాలు.
*వసతులు:* శిక్షణ కార్యక్రమాలు నిర్వహంచినపుడు ప్రత్యేక అలవెన్సులు, పర్యటనలకు (TA &DA), 


*4. సెక్టోరల్ ఆఫీసర్ -4:*  *I.E.D* (సమ్మిళిత విద్య, కమ్యూనిటీ మోబిలేషన్, మీడియా)
ప్రాధాన్యతా క్రమంలో రెండవ పోస్టు. మరియు పాఠశాలేతర విద్యాలయాల నిర్వహణ, నిధులపై నియంత్రణ కలది.
*విధులు👉:* జిల్లాలో సమగ్ర శిక్షా ద్వారనిర్వహించు అన్నీ సమ్మిళిత విద్యా కార్యక్రమాలు (IEC) , CWSN/OSC/వయోజన విద్య, నాన్ ఫార్మల్ విద్యా కార్యక్రమాలు, SMC/SDMC ల పనితీరు మెరుగుపరచడం, పాఠశాల బలోపేతానికి నిధులు, విరాళాల సేకరణ, సమాజాన్ని పాఠశాల నిర్వహణలో భాగస్వామ్యం చేసేలా వివిధ కార్యక్రమాల రూపకల్పన, విద్యా హక్కు చట్టం అమలు బాధ్యతలు, అందరికీ విద్య అందించే కార్యక్రమాలు, సమగ్ర శిక్షా కార్యక్రమాల పబ్లిసిటీ, మీడియా సంబంధాలు.
*వసతులు:👉* శిక్షణ కార్యక్రమాలు నిర్వహంచినపుడు ప్రత్యేక అలవెన్సులు, పర్యటనలకు (TA &DA &ఒక సహాయకుడు/CRP)
*అర్హతలు:👉* PG పూర్తి చేసుకున్న స్కూల్ అసిస్టెంట్ ( 5సంవత్సరాల బోధనానుభవం కలిగిన వారు మాత్రమే) లేదా గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అర్హులు. సాధారణ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగివుండి చక్కని భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు కలిగి ఉండవలెను.
*👉డీ పీ ఓ కార్యాలయ సంబంధిత పర్యటనకు సెక్టోరల్-1(Plg & MIS)కు  ప్రత్యేక వాహన సౌకర్యం మరియు సెక్టోరల్-2,3&4 (AMO,GCDO &IED) లకు కలిపి ఒక వాహనము సౌకర్యం ఉంటుంది.*


5. *అసిస్టంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్:* : 


*విధులు:*👉 జిల్లాకు సంభందించిన అన్నిరకాల వివరాల క్రోడీకరించి, సెక్టరాల్ అధికారులకి ముఖ్యంగా సెక్టోరల్-1 కి సహాయకులుగా వ్యవహరించడం, జిల్లాలోని అన్ని MRC ఉద్యోగుల సహాయం ద్వారా సమాచారం సేకరించడం. 


*వసతులు👉:* వ్యక్తిగత కంప్యూటర్ తో బాటు ఇంటర్నెట్ సౌకర్యం,  ఉచిత మొబైల్ (ఆప్షనల్),  శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు అలవెన్స్, పూర్తి స్థాయిలో ఇది జిల్లా విద్య శాఖ కార్యాలయం లోనే నిర్వహించవలసి ఉంటుంది.


6. 👉 *జిల్లా సైన్స్ అధికారి:*
*విధులు:*  జిల్లావ్యాప్తంగా సైన్స్ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, సైన్స్ ఫెయిర్, సెమినార్, ఉపాధ్యాయ శిక్షణలు నిర్వహణ, 


*వసతులు* 👉ప్రత్యేకంగా ఆఫీస్ విధులు లేకుండా , రోజువారీ పాఠశాలకు హాజరవుతూ కేవలం సైన్స్ కార్యక్రమాల సందర్భంలో పాల్గొంటారు.


ఈ నియామకాలను  రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా, అభ్యర్థి ఎంచుకున్న పోస్టుకు ఎంపిక జరుగుతుంది.
ఈ నియామకం 3 సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉండి, నేరుగా జిల్లా విద్య శాఖ DPO ఆధీనంలో నిర్వహించవలసి ఉంటుంది.
నియామకం పొందిన వారి వేతనాలు సమగ్ర శిక్షా నిధుల నుండి అందజేయబడుతయి.
పనితీరు సరిగా లేకపోవడం, ఆశించిన ప్రగతి లేకపోవడం, కార్యాలయాన్ని, సిబ్బందిని అప్రతిష్ట కు గురిచేయడం, కార్యాలయ నిధులు దుర్వినియోగం చేసిన సందర్భాలలో CDSE వారు విధులు నుండి తొలగించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టగలరు.


*🔹ముఖ్యమైన తేదీలు*


👉29.10.2019. - పత్రికా ప్రకటన
👉02.11.2019. - online దరఖాస్తు స్వీకరణ ప్రారంభం
08.11.2019. - దరఖాస్తుల సమర్పణ కు ఆఖరు తేదీ.
👉24.11.2019 - హల్ టికెట్స్ జారీ
నవెంబర్ చివరి వారంలో పరీక్ష 
డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు 
డిసెంబర్ రెండవ వారంలో విధుల్లో చేరడం.


*ఎంపిక విధానం:👉* రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, రిటైర్డ్ GHM లు, NGO కార్యక్త లు ఇదే వరుస ప్రాధాన్యత క్రమంలో నియామకం జరుగును.


*గమనిక:👉* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదో ఒక పోస్టు కు మాత్రమే ఎంపిక చేసుకోవ లెను. నియామకం పొందిన వారం రోజుల్లో విధుల్లో చేరని పక్షంలో లేదా ఏదేని కారణాలతో తొలగించబడినచో మెరిట్ ప్రకారం తరువాతి అభ్యర్థిని నియమించడం జరుగును.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...