ఎస్ జి టి కౌన్సిలింగ్ షెడ్యూల్

*టీఆర్టీ  ఎస్జిటి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల*👆


 తెలంగాణలో టీఆర్టీ-2017 ఎస్జిటి నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఎస్జిటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్దేశిత తేదీల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. 


*టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..*
*23-10-2019:* జిల్లా వారీగా ఎంపికై న అభ్యర్థుల జాబితా ప్రదర్శన(మీడియం వారీగా) రూల్2,3 ప్రకారం జిల్లా విద్యా శాఖ అధికారులతో ఖాళీల గుర్తింపు కౌన్సెలింగ్ నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ ద్వారా పత్రికా ప్రకటన జారీ 


*24-10-2019:* రూల్ 2, 3 ప్రకారం వేకెన్సీ జాబితా ఖరారు కోసం జిల్లా స్థాయి కమిటీ సమావేశం మీడియం, కేటగిరీ వారీగా జిల్లాలో వేకెన్సీ పొజిషన్
వెబ్‌సైట్‌లో ప్రకటన


 *25-10-2019* :  అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన 


*28-10-2019-29-10-2019:*  అపాయింట్‌మెంట్, పోస్టింగ్ ఉత్తర్వుల జారీ కోసం కౌన్సెలింగ్ ,నియామక ఉత్తర్వుల అందజేత


*30-10-2019:* నియామక ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయుల రిపోర్టింగ్ 


*02-11-2019:* రిపోర్టు చేయని వారి జాబితాను డీఈవోలు రూపొందిస్తారు 


*౦4-11-2019:* రూల్-5 ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా నియామక పత్రాల జారీ 


*05-11-2019:* విధుల్లో చేరిన ఉపాధ్యాయుల జాబితాను హెచ్‌ఎంలు, మండల విద్యా శాఖ అధికారులుడీఈవోకు సమర్పించాలి నోటీస్ బోర్డు/ డీఈవో వెబ్‌సైట్‌లో విధులోచేరిన టీచర్ల జాబితా ప్రదర్శన 


*07-11-2019:* నాన్ రిపోర్టింగ్, నాన్ జాయినింగ్ వివరాలజాబితా టీఎస్‌పీఎస్సీకి సమర్పణ జిల్లా వారీగా పూర్తిస్థాయి జాబితా పాఠశాలవిద్యా శాఖ కమిషనర్‌కు సమర్పణ


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...