ఏ ఎన్ ఆర్ పి కాల్వ ద్వారా మూసీ ప్రాజెక్టును నింపి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ అన్నారు.కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టును AMRP కాలువ ద్వారా నింపాలని ఆదివారం నల్లగొండ ఇంచార్జీ కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ గత పది రోజుల క్రితం మూసీ ప్రాజెక్టు గేటు విరిగిపోవడంతో నీరంతా దిగువనకు వెళ్లిపోయి ప్రాజెక్టు ఖాళీ అయిందని అన్నారు.మళ్లీ ప్రాజెక్టులోకి వరద వచ్చే అవకాశం లేకపోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు.మూసీ ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలు సాగవుతాయని తెలిపారు.శ్రీశైలం నుంచి వరద నీరు వస్తున్నందున ఎమ్మార్పీ ద్వారా మూసీ ప్రాజెక్టు నింపి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ విషయంపై సిఎంతో కూడా చర్చించడం జరిగిందని అన్నారు.రబీ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని వెంటనే పాజెక్టు నింపాలని అన్నారు.కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో నకిరేకల్ ఎంపిపి పెరుమాళ్ల శేఖర్, జడ్పీటీసీ బొప్పన స్వర్ణలత ,జిల్లా కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్ ,బోళ్ళ వెంకట్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, ప్రభాకర్,సునీత తదితరులు పాల్గొన్నారు.
ఏ ఎమ్ ఆర్ పి కాలువ ద్వారా మూసి ప్రాజెక్ట్ ను నింపాలని డిమాండ్ భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...