నూతన జిల్లా జడ్జి ని కలిసిన ఎస్పీ రంగనాథ్

*నూతన జిల్లా జడ్జిని కలిసిన ఎస్పీ రంగనాధ్*


నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.వి. రమేష్ బాబును జిల్లా ఎస్పీ రంగనాధ్ మర్యాదపూర్వకంగా కలిశారు.


మంగళవారం జిల్లా కోర్టు భవనంలో ఆయన ఛాంబర్ లో న్యాయమూర్తిని కలిసి మొక్క అందచేసి జిల్లాకు వచ్చినందుకు స్వాగతం పలికారు. కేసుల పరిష్కారం సాధ్యమైనంత త్వరగా అయ్యేలా చూడాలని, కేసులలో శిక్షల శాతం పెరిగేలా చూడాలని కోరారు. కోర్టు కానిస్టేబుల్స్ కు కేసులలో అవసరమైన సూచనలు అందించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు.


ఎస్పీ వెంట కోర్టు లైజన్ అధికారి శ్రీనివాస్, గురువయ్య, శ్రీరామ్ తదితరులున్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...