పోలీసులను ఆశ్రయించే ప్రతి ఒక్కరికి న్యాయం : ఎస్పీ రంగనాథ్

*పోలీసులను ఆశ్రయించే ప్రతి ఒక్కరికి న్యాయం : ఎస్పీ రంగనాధ్*


నల్గొండ : అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ అన్నారు. 


మంగళవారం నాడు ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.  గ్రీవెన్స్ డే ద్వారా ప్రజల నుండి స్వీకరిస్తున్న దరఖాస్తులు, ఆర్జీలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ద్వారా అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రజల నుండి వస్తున్న ప్రతి దరఖాస్తును పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి దరఖాస్తుదారునికి రశీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారం అయిందో లేదో తెలుసుకుంటున్నామని తెలిపారు. వీటన్నింటితో పాటు మూడు కన్నా ఎక్కువ సార్లు వచ్చిన దరఖాస్తుల విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందనే విషయమై విచారిస్తున్నామని తెలిపారు. పరిష్కారం అయిన ఫిర్యాదులు, అర్జీలకు సంబంధించి సెంట్రల్ కంప్లైంట్ సెల్ ద్వారా సమాచారం అందిస్తున్నామని వివరించారు. దరఖాస్తులన్నింటిని ఆన్ లైన్ లో పొందుపర్చడం ద్వారా వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరిగుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీస్ అధికారులతో గ్రీవెన్స్ విషయంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించడం జరిగిందన్నారు. గ్రీవెన్స్ సంఖ్య క్రమంగా పెరుగుతున్నందువల్ల అందుకు అనుగుణంగా ఫిర్యాదుదారులకు సమయం కేటాయిస్తున్నామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.


దరఖాస్తుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఫోన్ ల ద్వారా ఆదేశించారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...