గ్రామపంచాయతీ కార్మికుల వేతనం పెంపు

 తెలంగాణలో గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికుల వేతనాన్ని రూ.8,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఒక్కో పంచాయతీలో ఒక్కో రకమైన వేతనం ఉండేది. ఈ నేపథ్యంలో తక్కువ వేతనాలు ఉన్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. అన్ని పంచాయతీల్లో కార్మికులకు ఒకే రకమైన వేతనాలు ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీనికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...