నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ వైద్యం..
BRS హయాంలో మెరుగైన వైద్య సేవలు..
గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు వైద్య మరియుఆరోగ్య శాఖలపై ప్రత్యేక శ్రద్ధ..
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో 2 కోట్ల 14 లక్షల రూ. తో CT స్కాన్ యంత్రం ఏర్పాటు..
30 లక్షల రూ. లతో Eye Phaco మిషన్ ఏర్పాటు..
7 లక్షల రూ. లతో 500 MA X Ray Unit ఏర్పాటు...
జిల్లా వ్యాప్తంగా 400 BP డిజిటల్ మిషన్ లు పంపిణీ..
ప్రతి ANM దగ్గర బ్లడ్ ప్రెషర్ డిజిటల్ మిషన్...
*CT స్కాన్ సేవలను ప్రారంభించిన గౌ.మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు..*
*నిజామాబాద్,. :రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు,గౌ.నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు ప్రజా ప్రతినిధులు నిజామాబాద్ జిల్లా సాధారణ ప్రభుత్వ ఆసుపత్రిలో CT స్కాన్ యంత్రం, Eye Cataract Phaco మిషన్,X Ray Unit మరియు జిల్లామానసిక చికిత్స ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
*ఈ సందర్భంగా గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ...*
గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి సారించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రి లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి పేద మరియు నీరు పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా లో ని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసి ANM లకు 400 డిజిటల్ BP నిర్ధారణ మిషన్ లను ఈరోజు పంపిణీ చేసాము.
2 కోట్ల 14 లక్షల రూ.లతో CT స్కాన్ యంత్రాన్ని ప్రారంభించాము.
ప్రయివేట్ స్కానింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రి లొనే రోగులకు ఉచితంగా CT స్కాన్ చేసి రోగ నిర్ధారణ చేయబడును.
కంటి పరీక్ష విభాగం లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం 30 లక్షల రూ.లతో Eye Phaco మిషన్ ని ఏర్పాటు చేసాము.
ఆర్థోపెడిక్ విభాగం లో 7 లక్షల రూ.లతో 500 MA X Ray మిషన్ ని ఏర్పాటు చేసాము.
మానసిక రోగుల కొరకు ప్రత్యేకంగా మానసిక చికిత్స ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించము.
ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి లలోనే చికిత్స పొందడానికి వీలుగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.
ప్రజల ముంగిట మరింత చేరువగా వైద్య సేవలను అందిస్తున్న గౌ.ముఖ్యమంత్రి శ్రీ గారికి, గౌ.ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ & జడ్పీ చైర్మన్ శ్రీ దాదన్న గారి విఠల్ రావు గారు,నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారు,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు,TSWDC చైర్ పర్సన్ ఆకుల లలిత గారు,ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు శ్రీమతి డా.ప్రతిమ రాజ్ గారు,మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీమతి డా. ఇందిరా గారు,సైకియాట్రీస్ట్ డా.విశాల్ గారు,స్థానిక కార్పొరేటర్ భైఖాన్ సుధ మధు గారు మరియు వైద్య సిబ్బంది, BRS నాయకులు పాల్గొన్నారు.