నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు* జిల్లా యస్.పి కె.అపూర్వ రావు


 *--నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీసు* 

 *---నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు* 

-జిల్లా యస్.పి కె.అపూర్వ రావు



IPS

*వీరి వద్ద నుండి 8 క్వింటాల 45 కిలోల ముడి పత్తి విత్తనాలు,444 ప్యాకెట్లు (2 క్వింటాలు) మొత్తం 10 క్వింటాల 45 కిలోలు,(దాదాపు 10 లక్షల రూపాయల విలువ)* 


తేది 31-05-2023 ఉదయం 3 గంటల సమయంలో మునుగోడు యస్.ఐ సతీష్ రెడ్డి  మరియు సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు బస్ స్టాండ్ వద్ద  అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనపడగా వారి వద్దకు వెళ్ళి తనికి చేయగా వారి వద్ద ఎటువంటి ఆదారాలు లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లను కలిగి ఉన్నారు. వెంటనే  వ్యవసాయ అదికారులను పిలిపించి చెక్ చేయగా వారు  నకిలీ విత్తనాలు అని తెలపగా వీరిని అదుపులోకి తీసుకొని విచారించగ ఆంద్ర ప్రదేశ్ రాస్త్రనికి చెందిన కర్నాటి మధుసూదన్ రెడ్డి, తండ్రి:బాల్ రెడ్డి, గురిజాల వీర బాబు, తండ్రి: యేసు ప్రసాద రావు వీరు గత కొంత కాలంగా నంద్యాల పరిసర ప్రాంతాలలో రైతుల వద్ద నుండి తక్కువ ధరకు పత్తి విత్తనాలు కొని గుంటూర్ కు తరలించి అక్కడ హరి కృష్ణ రెడ్డి కి చెందిన పాత మిల్లు నందు వీర బాబుతో కలిసి ప్రాసెస్ చేసి తమ వద్ద ఉన్నటువంటి గుర్తింపు లేని  మేఘనా మరియు అరుణోదయ పేరుతో   పది ఫ్యాకెట్లలో ఫ్యాక్ చేసి గుంటూరు నుండి మునుగోడు కు తీసుకొని వచ్చి ఇక్కడ రైతులకు  మరియు డీలర్ లకు చూపించి అమ్మటానికి రాగా పట్టుబడి చేయటం జరిగింది. తర్వాత వీరు చెప్పిన వివరాల మేరకు హరి కృష్ణ రెడ్డి కి చెందిన పాత మిల్లు నుండి మిగిలిన నకిలీ విత్తనాలను స్వాదీనము  చేసుకోని నిందితులను రిమాండుకు పంపనైనది.

 *నిందితుల వివరాలు* 

1.కర్నాటి మధుసూదన్ రెడ్డి, తండ్రి: బాల్ రెడ్డి, వయస్సు: 50 సం;వృతి: వ్యవసాయం,గ్రామం: w గోవిందిన్న, తాలూకా:ఆళ్లగడ్డ, జిల్లా:నంద్యాల.   

2. గురిజాల వీర బాబు, తండ్రి: యేసు ప్రసాద రావు, వయస్సు: 40 సం; వృతి: వ్యవసాయం,గ్రామం: గండేపల్లి ,మండలం: తాళ్ళూరు, జిల్లా: తూర్పు గోదావరి.


గతంలో కర్నాటి మధుసూదన్ రెడ్డి పై నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడి రెండు సార్లు పి.డి ఆక్ట్ నమోదు చేసి జైలు కి వెళ్ళి రావడం జరిగింది. 


ఈ కేసులో నిందితులను పట్టుకున్న నల్లగొండ డి.యస్.పి గారి అద్వర్యంలో చండూర్ సి.ఐ అశోక్ రెడ్డి,మునుగోడు యస్.ఐ సతీష్ రెడ్డి,కట్టంగూర్ యస్.ఐ విజయ్, సిబ్బంది నాగరాజు,రామ నరసింహ, యస్.పి గారు అభిందిచినారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...