జర్నలిస్టులపై అట్రాసిటీ కేసు చెల్లదు: హైకోర్టు



 *జర్నలిస్టులపై అట్రాసిటీ కేసు చెల్లదు: హైకోర్టు*


*విధుల్లో ఉన్న జర్నలిస్టుకి ఎదుటివారు ఏ సామాజిక వర్గమో ఎలా తెలుస్తుంది?" అని హైకోర్టు ప్రశ్నించింది.*


*ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసులను నిలదీసింది.*

*ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటే ఫిర్యాది దారు ఏ సామాజికవర్గానికి చెందినవారో నిందితులకు తెలిసి ఉండాలని, కానీ ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు కులం గురించి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు తెలియదని అభిప్రాయపడింది.* 


*అందువల్ల జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదని స్పష్టం చేసింది.*


*తమపై ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ 3(2)(ఎ) కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు జర్నలిస్టులు హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం ఈ పిటిషన్పై జస్టిస్ ఎం. మాన వేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు.*

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...