పజ్జూరలో శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి శంఖుస్థాపన చేసిన యం.ఎల్.ఎ భూపాల్ రెడ్డి.
తిప్పర్తి: మండల పరిదిలోని పజ్జూరు గ్రామంలో సోమవారం నాడు నూతనంగా పున:నిర్మిస్తున్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయ నిర్మాణానికి నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల.భూపాల్ రెడ్డి గారు శంఖుస్థాపన చేసి పూజా కార్యక్రమంలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాపలకం ఆవిష్కరించి మాట్లాడుతు ఘనమైన చారిత్రక నేపథ్యం వున్న పజ్జూరు లో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా నిర్మాణం కాబోతున్న రామలయం పనులు త్వరిత గతిన పూర్తిచేయ్యడానికి అందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేస్తు దేవాలయాల నిర్మాణానికి పాటుపడుతన్నారని అన్నారు. పజ్జూరు లో రామలయానికి దేవాదాయ శాఖ నుండి 40లక్షల రూపాయాలు మంజూరు చేయించడం జరిగిందని గ్రామస్తులు కూడా తమ వంతుగా ఆర్దీక సహాయం చేసి నిర్మాణానికి సహాకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యం.పి.పి. నాగులవంచ విజయలక్ష్మి, వైస్.యంపి.పి ఏనుగు.వెంకట్ రెడ్డి, సర్పంచ్ మోయిజ్, TRS మండలపార్టీ అధ్యక్షులు రవిందర్ రెడ్డి, PACS చైర్మన్ సంపత్ రెడ్డి,డైరక్టర్ శ్రీనివాస్, కందుల.లక్ష్మయ్య ఉపసర్పంచ్ సుకన్యశ్రీనివాస్, కో-ఆప్షన్ రాగి. మురళి, చిరంజీవి, నర్సింహ్మ, దేవాలయ చైర్మన్ దొమ్మాటి.శ్రీనివాస్, యం.జానయ్య, జాల.సాయిలు, గడగోజు.సత్యనారాయణ, సింగం.లింగయ్య రాంబాబు, ముత్తయ్య తదితరులు పాల్గోన్నారు.