*పోలీస్ శాఖ అధ్వర్యంలో లైంగిక వేదింపుల కేసులో బాధితులకు తక్షణ ఆర్ధిక సహాయం* ..
*జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ. పి.యస్*
జిల్లా పోలీస్ కార్యాలయం నందు నేడు లైంగిక వేదింపులు ద్వారా మోసపోయిన బాధితులకు తక్షణ ఆర్ధిక సహాయం అందజేయడం జరిగిందని జిల్లా యస్.పి గారు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ లైంగిక వేదింపుల కేసుల్లో బాధితులుగా ఉన్న మహిళలకు, బాలలకు భరోసా సెంటర్ ద్వారా ప్రభుత్వ సేవలు, పోలీసు సేవలు అందిస్తున్నట్లు, న్యాయపరమైన, వైద్యపరమైన, నైతిక పరమైన, సాంకేతిక పరమైన, సామాజికపరమైన భద్రత, సహాయ, సహకారాలను భరోసా సెంటర్ ద్వారా బాధితులకు అందించడం జరుగుతుందని అన్నారు. పోలీసు భరోసా సెంటర్ మరియు షీ టీమ్స్ ద్వారా ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, బాధితులకు అందించవలసిన సేవల గురించి వివరించి, లైంగిక వేదింపుల కేసుల్లో బాధితులు ఉన్న ఇద్దరికి పోలీస్ శాఖ అధ్వర్యంలో తక్షణ ఆర్ధిక సహాయాన్ని భరోసా కేంద్రం నుండి అందించడం జరిగిందని, ప్రభుత్వం ద్వారా అందవలసిన ఆర్ధిక సహాయాన్ని అందించడంలో పోలీస్ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో షి టీమ్ ఇంచార్గ్ సి. ఐ రాజశేఖర్ గౌడ్, ఉమెన్ ఏ.యస్. ఐ ఆబెదా బరోసా సెంటర్ కోఆర్డినేటర్ నళిని పాల్గొన్నారు.