నల్గొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి... అంగరంగ వైభవంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ

నల్గొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి...



 అంగరంగ వైభవంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ....


తీరొక్క పూలతో.. బతుకమ్మలు పేర్చిన మహిళలు...


  ఆట..పాటలతో అలరించిన ఆడపడుచులు...


 భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళ నాయకులు....


 నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి  సతీమణి కంచర్ల రమాదేవి గారి ఆధ్వర్యంలో... ఎంగిలి పువ్వు బతుకమ్మను  వారి నివాసం వద్ద అంగరంగవైభవంగా..ఘనంగా నిర్వహించారు...

 ఉదయం 8 గంటల వరకే తీరొక్క పూలతో అక్కడికి విచ్చేసిన  మహిళలు... అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా.. బతుకమ్మలు పేర్చారు.. తంగేడు పువ్వు జిల్లేడు పువ్వు గునుగు పువ్వు బంతి చామంతి తీరొక్క పూలతో.. అందంగా బతుకమ్మలు పేర్చి అందులో పసుపు గౌరమ్మను ఉంచి  భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు..

 అనంతరం... బతుకమ్మ పాటలకు

 లయబద్ధంగా నృత్యాలు చేస్తూ కోలాటాలు వేస్తూ .. అత్యంత ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలలో పాలుపంచుకున్నారు...

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు కూడా..  బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విశేషం..

 ఈ కార్యక్రమంలో నల్గొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు సతీమణి కంచర్ల రమాదేవి తో పాటు... ఐ సి డి సి ఎస్ మాజీ కోఆర్డినేటర్ మాలే శరణ్య రెడ్డి, ఏచూరి శైలజ, సింగం లక్ష్మి, దైద రజిత, యాట జయప్రద రెడ్డి, మామిడి పద్మ, కేతిరెడ్డి కవిత  దుబ్బ రూప, కోండ్ర స్వరూప, గుండ్రెడ్డి సరోజన, కత్తుల సంధ్య గాలి రాధిక, కంచర్ల విజయ, తదితరులు పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...