అన్ని వయసులవారు సమతుల పోషకాహారం తీసుకోవడం అవసరం: జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త లక్ష్మయ్య
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి జాతీయ పోషకాహార ప్రోత్సాహక కార్యక్రమం
హైదరాబాద్, స::న్ని దశలలో సమతుల పోషకాహార ప్రాధాన్యత పెరిగిందని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త లక్ష్మయ్య తెలిపారు. గతంలో కేవలం బాల బాలికల పోషకాహారం మీద మాత్రమే శ్రద్ద పెట్టిన మనం ఇప్పుడు అన్ని వయసుల వారికి పోషక విలువలు కలిగిన ఆహారం అందించడానికి కృషి చేస్తునట్లు తెలిపారు. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పోషకాహార ప్రోత్సాహక కార్యక్రమం కింద పిండ దశ నుంచి మొదలు శిశువులు, గర్భిణులు, బాలితలు, కిశోర్ బాలికల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన అన్నారు.
సెప్టెంబరు నెలలో పోషణ మాసోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విభాగమైన పత్రికా సమాచార కార్యాలయం మంగళవారం పోషకాహారంపై ‘కేంద్ర, రాష్ట్ర స్థాయి అనుబంధ పోషకాహార కార్యక్రమాలు-పథకాలు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు.
పత్రికా సమాచార కార్యాలయం ఉప సంచాలకులు డాక్టర్ మానస్ కృష్ణ కాంత్ ప్రారంభోపన్యాసం చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా సెప్టెంబరు నెలలో పోషణ మాసోత్సవాలను నిర్వహిస్తునట్లు తెలిపారు. అనంతరం ఎన్ఐఎన్ శాస్త్రవేత్త శాస్త్రవేత్త డాక్టర్ ఆవుల లక్ష్మైయ్య మాట్లాడుతూ గర్భంలో పిండ దశ మొదలు వృదాప్యం వరకు సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికీ భారత దేశం లో మహిళలో ఎక్కువగా సూక్ష్మ పోషకాలు, బి12, ఐరన్, ఫోలిక్‌యాసిడ్ లోపాలు ఉంటున్నట్లు గుర్తించామన్నారు.
ఈ లోపాల నుంచి బయటపడేందుకు విభిన్న ఆహార పదార్థాలను తగినంత మోతాదులో ప్రతి రోజూ తీసుకోవాలని ఆయన సూచించారు. యుక్త వయసులో ఆడపిల్లలు తీసుకున్న ఆహారం పైనే వారికి భవిష్యత్తులో పుట్టబోయే పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు.
సరైన మోతాదులో సరైన సమయంలో నాణ్యమైన పోషకాహారం తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమని చెప్పారు. తాజా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, కొవ్వు పదార్థాలు తగిన మోతాదులో ప్రతి రోజూ తీసుకోవాలని కోరారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పోషకాహర విధానాలను డా.లక్ష్మయ్య ఈ సందర్బంగా వివరించారు.
ఈ వెబినార్‌లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారులు, సిబ్బందితోపాటు తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, అంగన్ వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.