**
*హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పవర్ కట్ (Power Cut) నిర్వహిస్తున్నట్లు పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ (Power Engineers Association), విద్యుత్ జేఏసీ ప్రతినిధులు (Vidyut Jac Leaders) ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ (Central Government) ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు(Electricity Act Amedment Bill)కు నిరసనగా మహాధర్నా (MahaDharna) చేపడుతున్నట్లు తెలిపారు. మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.*
*ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నేతలు మాట్లాడుతూ ‘‘కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8న (సోమవారం) పార్లమెంట్‌లో విద్యుత్ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించాలి. ఒక వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతాం. దానికి వినియోగదారులు సహకరించాలి. విద్యుత్ బిల్లును ప్రవేశపెడితే విధులు బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగుతాం.’’ అని హెచ్చరించార