ఆత్మ నిర్భర్ దివస్ సందర్భంగా... చిరు వీధి వ్యాపారులు వారి ఆర్థిక  సహాయం అందించిన బ్యాంకర్లను నల్లగొండ శాసనసభ్యులు  కంచర్ల భూపాల్ రెడ్డి గారు  సన్మానించారు .

 నేడు..నల్గొండ స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో...

 2019 కోవిడ్ సమయంలో.. పట్టణ వీధి వ్యాపారులకు స్వనిధి -ఆత్మ నిర్భర్ పథకంలో భాగంగా నల్లగొండ పట్టణంలో 5098 చిరు వీధి వ్యాపారులకు వివిధ బ్యాంకు ల ద్వారా పదివేల రూపాయలు చొప్పున... లాక్ డౌన్ సమయంలో వారి వ్యాపారాలు దెబ్బతినకుండా ఆర్థిక సహాయం  అందించారు... ఈ స్కీమ్ ను పొడిగిస్తూ బ్యాంకు లోన్ సక్రమంగా చెల్లించిన వారికి మరో 20 వేల రూపాయల  ఆర్థిక సహాయం2055 మందికి పట్టణంలో అందించారు.

 ఆజాదీ అమృత్ మహోత్సవ్ లో భాగంగా..

 నేడు స్వనిధి -ఆత్మ నిర్భర్ దివస్ సందర్భంగా... చిరు వీధి వ్యాపారులు వారి ఆర్థిక  సహాయం అందించిన బ్యాంకర్లను

నల్లగొండ శాసనసభ్యులు

 కంచర్ల భూపాల్ రెడ్డి గారు

 సన్మానించారు ఈ


సందర్భంగా వారు మాట్లాడుతూ...

 కోవిడ్ లాక్డౌన్ సమయంలో  ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం  బ్యాంకుల ద్వారా అందించిన ఆర్థిక సహాయంతో.. తమ జీవనోపాధిని కోల్పోకుండా తమ వ్యాపారాలు కొనసాగించుకొని .ధైర్యంగా కోవిడ్ పరిస్థితి లను ఆత్మ విశ్వాసం తో ఎదుర్కొన్నారని.. బ్యాంకు లు కూడా ఆర్థిక సహాయం అందించి వారికి బాసటగా నిలపడ్డాయాని అభినందించారు.

 ఆజాది అమృత్ మహోత్సవ్ లో భాగంగా నేడు

స్వనిధి ఆత్మ నిర్బర్ దివస్ సందర్భంగా... మెప్మా నల్లగొండ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,. స్వనిధి టీమ్ మెంబర్ విజయ్ సింగ్ న్యూ ఢిల్లీ. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కె.వి రమణాచారి,మెప్మా రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణ చైతన్య, పిడి మెప్మా శ్రీపాద రామేశ్వరరావు, మెప్మా జిల్లా కోఆర్డినేటర్ కేతావత్ శివాజీ, స్థానిక కౌన్సిలర్ లు పున్న గణేష్, గోగుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...