15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న 30 ఏళ్ల మహిళ, 

 



15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న 30 ఏళ్ల మహిళ, 


మాయమాటలతో బాలుడిని  కిడ్నాప్ చేసిన కేసును కృష్ణాజిల్లా గుడివాడ   పోలీసులు చేదించారు. గుడివాడ గుడ్ మేన్ పేటలో ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న స్వప్న అనే మహిళ, బాలుడు గత 19వ తేదీ నుండి కనిపించకపోవడంతో బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో మాయమాటలతో స్వప్న బాలుడిని అపహరించినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పోలీసులు స్వప్న, బాలుడు హైదరాబాద్ బాలానగర్ లో ఉన్నట్లు గుర్తించారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు స్వప్న పై ఫోక్సో చట్టం, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. టూ టౌన్ సిఐ దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించి బాలుడిని ప్రలోభ పెట్టిన, స్వప్న గత నెల రోజులుగా శారీరిక సంబంధం ఏర్పరచుకుందని తెలిపారు. మాయమాటలతోనే బాలుడిని స్వప్న కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...