- - నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్:

 *వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోతే చర్యలు : సిఐ శ్రీనివాస్*

- - నిబంధనలు పాటించకపోతే జరిమానాలు

- - నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్



నల్లగొండ : వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకుండా నడిపితే చర్యలు తప్పవని నల్లగొండ ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్ హెచ్చరించారు.


గురువారం నల్లగొండ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న 30 వాహనాలను స్వాధీనం చేసుకొని నెంబర్ ప్లేట్స్ బిగించిన తర్వాత జరిమానాలు విధించి వాహనాలను పంపించినట్లు తెలిపారు. అదే విధంగా పెండింగ్ చాలన్స్ పరిశీలించి వాటిని చెల్లించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు అనంతరం నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలని సూచించారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధించడం జరుగుతుందని, ముఖ్యంగా నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తించడం సైతం ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ఇకపై నెంబర్ ప్లేట్ లేని వాహనాల విషయంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.


ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ వెంట ట్రాఫిక్ ఎస్.ఐ. జయానందం, ఏ.ఎస్.ఐ. బుచ్చిరాములు, మహేందర్, శ్రీను తదితరులున్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...