రైతు బంధు సంబురాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు....
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు అర్సపల్లి నిర్వహించిన రైతు బంధు సంబురాల్లో పాల్గొన్న
.
●అర్సపల్లి ప్రధాన వీధుల్లో రైతులతో కలిసి పాద యాత్ర నిర్వహించారు.
●అర్సపల్లి చావిడి వద్ద స్థానిక రైతులతో కలిసి గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ....*
●నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గం పూర్తిగా పట్టణం అయినప్పటికీ 15వ డివిజన్ లో రైతులు ఉన్నారు.ఈ రోజు రైతులతో కలిసి రైతు బంధు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము.
● దేశానికి అన్నం పెట్టే అన్న దాతల కోసం రైతు బంధు పథకం క్రింద 50 వేయిల కోట్ల రూ. లు రైతుల ఖాతాల్లో జమ చేసిన రైతు బంధావుడు మన గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు.
●8 సీజన్ లుగా ఎటువంటి ఆటంకం లేకుండా కరోన సంక్షోభం ని తట్టుకొని రైతు బంధు ని అమలు చేస్తూ రైతులకు దన్నుగా నిలిచింది TRS ప్రభుత్వం.
●నాడు సమైఖ్య పాలనలో బీడులు పడ్డ నేలలు నేడు ప్రపంచం లో అతి పెద్ద Lift Irrigation Project కాళేశ్వరం తో పచ్చని పంట పొలాలు పైరు గాలులతో విరసిల్లుతోంది
●మిషన్ కాకతీయ పథకం ద్వారా తెలంగాణ లోని అన్ని చెరువులు కుంటలు అభివృద్ధి చేసుకొని భూ గర్భ జలలాని పెంచుకోవడం జరిగింది.
●స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎ ప్రభుత్వం కూడా ఇన్ని కార్యక్రమాలు అమలు చేయలేదని స్థానిక రైతులు చెపుతున్నారు.
●రైతులకి అండగా రైతు బంధు,రైతు భీమా,24 గంటల ఉచిత కరెంట్ తో పాటుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రైతు బంధావుడు గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి స్థానిక రైతులు అభినందనలు తెలియచేస్తు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారు,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ ముచుకుర్ లావణ్య నవీన్ గారు, TRS పార్టీ నగర అధ్యకులు సిర్ప రాజు, సెక్రెటరీ ఏనుగందుల మురళి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, రైతు విభాగం నాయకులు చేగంటి గంగాధర్,బెల్లాల్ అశోక్, TRS పార్టీ కార్పొరేటర్లు/నుడ డైరెక్టర్లు,TRS నాయకులు తదితరులు పాల్గొన్నారు.