*ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ను పరామర్శించిన ఎస్పీ రెమా రాజేశ్వరి*
నల్లగొండ : తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్ ను జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సోమవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఇటీవల గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య అనారోగ్యంతో మృతి చెందిన క్రమంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె నల్లగొండ పట్టణంలోని కిషోర్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆనంతరం ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ ఇంటికి వస్తున్న క్రమంలో అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, ఇతర విషయాలను ఆమె ఎమ్మెల్యే తో చర్చించిన అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబందించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆమె వెంట నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, వన్ టౌన్ సిఐ వలగోపాల్, సిఐ రాఘవులు తదితరులున్నారు.