*ఒక్క సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానం : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి* -

 *ఒక్క సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానం : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి* -


- నల్లగొండ మండలం దండెంపల్లి, రెడ్డి కాలనీ గ్రామాలలో పోలీస్, ప్రజల భాగస్వామ్యంతో సిసి కెమెరాల ఏర్పాటు - - సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట - - మండలంలోని అన్ని గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి నల్లగొండ : ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించవచ్చని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మండలం దండెంపల్లి, రెడ్డి కాలనీ గ్రామాలలో రెండు గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు, కంట్రోల్ పాయింట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సిసి కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో సిసి కెమెరాలు కీలకంగా మారుతున్నాయని చెప్పారు. అనేక కేసులును ఛేదించడంలో, దొంగతనాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని అప్పుడే గ్రామీణ ప్రాంతాలలో నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేలా చేయడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే సందర్భంలో చాలా కేసులలో గుద్ది పారిపోయే వాహనాలను గుర్తించే అవకాశం సైతం సిసి కెమెరాలతో కలుగుతుందన్నారు. నల్లగొండ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను సహకరిస్తూ ప్రతి గ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. నల్లగొండ రూరల్ ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. చొరవ, ప్రత్యేక కృషితో పాటు రెండు గ్రామాల గ్రామస్తులకు సిసి కెమెరాల ఏర్పాటు పట్ల.అవగాహన కల్పించి చైతన్యం చేయడం ద్వారా ప్రజలు ముందుకు రావడం అభినందనీయమని డిఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీమతి చింత పుష్ప సైదులు, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్, రెడ్డి కాలనీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు రాజశేఖర్, రూరల్ పోలీస్ సిబ్బంది రమేష్, కిరణ్, గ్రామ ప్రజలు, యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...