*లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కింద ట్రాక్టర్లు అందజేత*
నల్లగొండ : లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు జిల్లా యంత్రాగం ద్వారా పునరావాసం కోసం మంజూరు చేసిన ట్రాక్టర్లను డిఐజి రంగనాధ్ లబ్ధిదారులకు అందజేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో గతంలో మావోయిస్టు ఉద్యమంలో పని చేసి జనజీవన స్రవంతిలోకి వచ్చిన పి.ఏ.పల్లి మండలం తిరుమలగిరి కి చెందిన బోడ అంజయ్య, గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన జానిబీ లకు జిల్లా యంత్రాగం మంజూరు చేసిన ట్రాక్టర్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాలని ఆయన వారికి సూచించారు. వారి ఇతర సమస్యలను సైతం పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.