*నిషేదిత పొగాకు ఉత్పత్తుల దహనం*


 *నిషేదిత పొగాకు ఉత్పత్తుల దహనం*

- - డిఐజి, ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో దహనం

- - నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై నిరంతర నిఘా

- - ప్రజారోగ్య పరిరక్షణలో అన్ని రకాల చర్యలు


నల్లగొండ : నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిరంతర నిఘా ఉంటుందని, నిషేధిత పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు.


శనివారం ఫుడ్ సేఫ్టీ డేసిగినేటెడ్ అధికారిణి జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిల సమక్షంలో ఇటీవల దాడులు నిర్వహించి సీజ్ చేసిన నిషేధిత పొగాకు ఉతత్తులను దహనం చేశారు. ఈ సందర్భంగా డ్8ఐజీ రంగనాధ్, ఫుడ్ సేఫ్టీ డిసిగ్నేటెడ్ అధికారిణి జ్యోతిర్మయి మాట్లాడుతూ నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాలలో ఆకస్మిక దాడులు నిర్వహించి సీజ్ చేసిన పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దహనం చేశామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే ఇలాంటి ఉత్పత్తులు క్యాన్సర్ కు కారకాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిషేధిత ఉత్పత్తులపై నిరంతర నిఘా ఉంటుందని, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఎక్కడైనా ఇలాంటి ఉత్పత్తులను విక్రయిస్తే సమాచారం అవ్వాలని కోరారు.


ఈ కార్యక్రమంలో నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్ సిఐలు నిగిడాల సురేష్, చంద్రశేఖర్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...