నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు పోలీసుల సూచనలు*

 *

💥 ప్రచార పర్వంలో వినియోగించే ప్రతి వాహనానికి రిటర్నింగ్ అధికారి ద్వారా అనుమతి తప్పనిసరి

💥 ఎన్నికల ప్రవర్తనా నియమావళి విధిగా పాటించాలి

💥 రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా ప్రచారానికి వినియోగిస్తే వాహనాలు సీజ్ చేస్తాం

💥 కోవిడ్, ఎన్నికల నిబంధనల ప్రకారమే కేంద్ర, రాష్ట్ర మంత్రుల కాన్వాయిలో భద్రతా సిబ్బంది వాహనాలు మినహాయించి అయిదు వాహనాలు మాత్రమే ఉండాలి.

💥 మిగిలిన వాహనాలు 100 మీటర్ల దూరం పాటించాలి.

💥 కోవిడ్ నిబంధనల ప్రకారం ఒక కాన్వాయికి మరో కాన్వాయికి మధ్య 30 నిమిషాల పాటు సమయం దూరం ఉండేలా చూసుకోవాలి.

💥  ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వినియోగించే వాహనాల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు, అయితే ప్రచారానికి వినియోగించే అన్ని వాహనాలకు విధిగా రిటర్నింగ్ అధికారి ద్వారా అనుమతి పొంది ఉండాలి.

💥 ఒక అభ్యర్థి పేరున అనుమతి పొందిన వాహనాన్ని ఇతర అభ్యర్థులు వినియోగిస్తున్నట్లుగా గుర్తిస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు ఆ వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది.

💥 కేంద్ర, రాష్ట్ర మంత్రుల కాన్వాయిలో అధికారిక వాహనాలు మినహా మిగిలిన వాహనాలకు రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరి.

💥 నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడంతో కేసులు నమోదు.

💥 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

💥 రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రచారంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ పోలీసులతో సహకరించాలి మరియు విధిగా అందరూ మాస్కు లు ధరించాలి.

*నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ*

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...