*
నల్లగొండ : వాహనదారులంతా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని తద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ చెప్పారు.
గురువారం 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా నల్లగొండ పట్టణంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్పుడే రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లాలో పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.