ప్రజ్ఞ భారతి నల్గొండ ఆధ్వర్యంలో CAA పై అవగాహన సదస్సు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లోని స్టే ఇన్ హోటల్ లో ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు కో కన్వీనర్ త్రిపురం భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కర్నాటి విజయకుమార్, నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేటు నంది శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటున్నారు. విశిష్ట అతిధులు గా డా. వైవి రాజశేఖర్ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.వి. శశిధర్, ప్రముఖ పాత్రికేయుడు రాకా సుధాకర్ లు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, 10 నిమిషాల ముందుకు రావలసిందిగా విజ్ఞప్తి చేశారు.