తెలంగాణా మహా జాతరలకు సర్వం సిద్ధం ... జాతరకు రూ 75 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ములుగు జిల్లా మేడారం లో ప్రతి రెండేళ్ళకుఒకసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియా లోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్దినొందింది,. తాడ్వాయి మండలం లోని కీకారణ్యం గుండా సాగే దారిలో వున్న మేడారం లో ప్రతి రెండేళ్లకు ఒకేసారి మాఘశుద్ధ్య పాడ్యమి రోజు ప్రారంభ మయ్యే ఈ అతిపెద్ద గిరిజన జాతరకు దాదాయపు కోటి మంది కి పైగా భక్తులు హాజరవుతారు. పూర్తిగా కోయ గిరిజన సాంప్రదాయం లో జరిగే ఈ జాతరలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ఏ విధమైన విగ్రహాలు గాని, ప్రతిరూపాలుగాని వుండవు. మేడారం జాతర కాశీ పుష్కర మేళాలకు, పూరీ జగన్నాధ రథయాత్రకు, తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు భిన్నమైన రీతిలో జరుగుతుంది. ఈ జాతరకు వచ్చే భక్తులు పసుపు, కుంకుమ, బెల్లం లాంటి వస్తువులతో అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. తెలంగాణా కుంభమేళా గా పిలిచే ఈ మేడారం జాతరకు ఆంద్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలోని గిరిజనులు, గిరిజనేతరులే కాకుండా విదేశీ భక్తులు కూడా వస్తారు.గిరిజన కుంభ మేళా గా పేరుగాంచిన మేడారం జాతరకు గాను హాజరయ్యే దాదాపు కోటిన్నర మంది భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండావుండేందుకు గాను కేసీఆర్ నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం రూ 75 కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లను చేపట్టింది। అదనపు స్నాన ఘట్టాల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుధ్య కార్యక్రమాలు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాల కల్పన, విస్తృత బందోబస్తు,రవాణా సౌకర్యం తదితర ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు।వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు।
రోడ్లు, భవనాల శాఖ:
మేడారానికి వెళ్లే రహదారుల నిర్మాణం, మరమత్తులు, నూతన రోడ్ల నిర్మానికిగాను రూ ౮౦౫ లక్షల రూపాలను కేటారించారు। దీనితో ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్లకు ప్యాచ్ వర్కులు, నూతన రోడ్ల నిర్మాణాలతో పాటు మేడారం లో నూతన గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని రోడ్లు, భవనాల శాఖ చేపట్టి పనులన్నింటినీ పూర్తి చేశారు। దాదాపు 25 పనులను చేపట్టి రోడ్డు భద్రతా నిబంధనలనలు పరిగణలో తీసుకొని పనులను చేపట్టారు।
నీటిపారుదల శాఖ:
మేడారం సందర్శించే లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటిపారుదల శాఖ విస్తృత ఏర్పాట్లను చేపట్టింది। ద్దాడాపు మూడున్నర కిలోమీటర్ల పొడవునా ఉన్న జంపన్న వాగులో ఉన్న ప్రస్తుత స్నానఘట్టాలకు మరమ్మతులు, కొత్త స్నాన ఘట్టాల నిర్మాణం, జంపన్న వాగు లో స్నానాలను ఆచరించేందుకై నీటి మట్టాలను సరిపడా ఉంచేందుకై క్రాస్ బండ్ల నిర్మాణం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గాను 132 ప్రత్యేక కంపార్టుమెంట్ల నిర్మాణం తదితర పనులను నాలుగు కోట్ల రూపాయలతో నీటిపారుదల శాఖ చేపట్టింది।
గిరిజన సంక్షేమ శాఖ:
మేడారం తో పాటు మేడారానికి దారి తీసే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను నాలుగు కోట్ల రూపాయల వ్యయం తో గిరిజన సంక్షేమ శాఖ చేపట్టింది। ప్రస్తుతం ఉన్న గిరిజన సంక్షేమ శాఖ క్రింద ఉన్నరోడ్లను పటిష్టం చేయడం, ప్రముఖుల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, ఆశ్రమ పాఠశాలలకు మరమ్మతులు, శాఖ క్రింద ఉన్న విశ్రాంతి భవనాలలో సౌకర్యాలు కల్పించడం, జాతరలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి వసతి కల్పించడం తదితర పనులను చేపట్టారు। దీనికి తోడూ ఈ సారి జాతరకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రూ 6,35 కోట్లను మూడు శాశ్వత షెడ్ ల నిర్మాణానికి నిధులను మంజూరు చేసింది। జంపన్న వాగులో ఐదు ఇన్ఫిల్టరేషన్ బావుల తవ్వకం, మేడారం పరిసర ప్రాంతాల్లో 229 సోలార్ లైట్ల ను ఏర్పాటు చేసేందుకు కూడా ఈ నిధులను ఉపయోగిస్తున్నారు।
గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం:
జాతరకు వచ్చే కోటి మందికి పైగా జనాలకు కనీససౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్లు, భూగర్భ మంచినీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టేందుకై ఆర్దబ్ల్యూఎస్ విభాగానికి ప్రభుత్వం పన్నెండు కోట్ల రూపాయలను కేటాయించింది। ఈ నిధులతో 8400 తాత్కాలిక మరుగు దొడ్లు, 538 బ్యాటరీ ఆఫ్ ట్యాపులు, 44 ఇంఫిల్టరేట్ బావుల తవ్వకం, ఒక దారిటరీ భావన నిర్మాణాన్ని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం చేపట్టి దాదాపు అన్నింటినీ పూర్తిచేశారు।
పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ:
పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా ప్రస్తుతం ఉన్న తొమ్మది రహదారుల విస్తరణ, మరమ్మతుల నిర్వహణ కు మూడున్నర కోట్లను కేటాయించింది।
పంచాయితీ రాజ్ పారిశుధ్య విభాగం:
పంచాయితీ రాజ్ పారిశుధ్య విభాగం ద్వారా పలు పనులను చేపట్టేందుకై రూ 366 కోట్లను ప్రభుత్వం కేటాయించింది।
ఈ నిధులతో ప్రధానంగా నాలుగు డంపింగ్ యార్డుల నిర్మాణం, 300 మినీ డంపింగ్ యార్డుల నిర్మాణం, చెత్త తరలింపుకై 3450 మంది పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా రప్పించారు, జాతర ముందు, జాతర అనంతరం మేడారం లో పారిశుధ్య పనులు నిర్వహించి ఏవిధమైన పరిశుభ్రం లేకుండా ఉండేవిధంగా చర్యలు పేపట్టారు।
ఎండోమెంట్ శాఖ::
మేడారం వచ్చే భక్తుల సౌకర్యార్థం పలు సౌకర్యాలను చేపట్టేందుకై మూడు కోట్ల రూపాయలతో ఎండోమెంట్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది।సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం తో పాటు ఇతర ఆలయాలకు పెయింటింగ్ చేయడం, విద్యుదీకరణ, భక్తులకు రెండు ప్రత్యేక షెడ్ ల నిర్మాణాన్ని ఎండోమెంట్ శాఖ చేపట్టింది। కాంపౌండ్ వాల్ నిర్మాణం, మంచినీటి పైప్ ఫైన్ల నిర్మాణం, పలు సెక్టార్లలో అవసరమైన చోట్ల టెంట్ల ను వేయడం తదితపనులన్నింటినీ ఎండోమెంట్ విభాగం చేపట్టింది।
విద్యుత్ శాఖ::
మేడారం జాతరలో నిరంతరం విద్యుత్ వెలుగులు వెదచల్లేందుకుగాను నాలుగు కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు। మేడారం లో కొత్తగా 247 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, 1724 కొత్త విద్యుత్ స్తంభాలను అమర్చడం, నాలుగు వందల కిలోమీటర్ల కొత్త వైర్ల ఏర్పాటు, 247 డీటీఆర్ లు, ఐదు వేల స్పెసర్లు, పద్నాలుగు కిలోమీటర్ల మేర ఎల్టీ కేబుల్ వైర్ ను విద్యుత్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది।
తెలంగాణా ఆర్టీసీ ద్వారా ఏర్పాట్లు ::
మేడారానికి వెళ్లే ప్రయాణికులను చేరవేయడానికి నాలుగు వేలకు పైగా బస్సులను తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది। మేడారం లో నలభై ఎకరాల్లో ప్రత్యేకంగా బాస్ స్టాండ్ కై ఏర్పాట్లను చేపట్టింది। 41 తాత్కాలిక క్యూ లైన్లను, ప్రత్యేకంగా సి సి కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ కేంద్రం తదితర ఏర్పాట్లను ఆర్ టీ సి చేపట్టింది। దాదాపు 248 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన మేడారం లో పన్నెండు వేలకు పైగా అధికారులు, సిబ్బందిని విధుల్లో ఆర్టీసీ నియమించింది।
అగ్నిమాపక శాఖ ఏర్పాట్లు ::
జాతర సందర్బంగా ఏవిధమైన ఉపద్రవం ఏర్పడినా ఎదుర్కొనేందుకు విపత్తుల నివారణ శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది। జాతర ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పది ఫైర్ ఇంజన్లను ఏర్పాటుచేసింది। 20 మిస్త్ బుల్లెట్లు, రెండు జీపులు, పది వాటర్ టెండర్లు, ఇరవై ఫైర్ టెండర్లను స్థానికంగా ఏర్పాటు చేస్తోంది।
వైద్య ఆరోగ్య శాఖ ::
మేడారం వాచీ భక్తులకు ఏ విధమైన అనారోగ్యం కలగా కుండా ఉండేందుకై వైద్య, ఆరోగ్య శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది। మేడారం లోని కళ్యాణ మండపం లో ప్రత్యేక సూపర్ష్పేషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది। ఈ జాతరలో ఇరవై మంది ప్రోగ్రామ్ అధికారులు, 170 వైద్యాధికారులు, 560 పారా మెడికల్ సిబ్బంది, 300 కి పైగా సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు। కోటీ యాభై లక్షల వ్యయంతో ఏర్పాట్లను వైద్య శాఖ ఏర్పాట్లను చేపట్టింది।
రెవిన్యూ శాఖ::
జాతరను సక్రమంగా నిర్వహించేందుకు రెవిన్యూ శాఖ పలు శాఖలతో సమన్వయము చేస్తోంది। ముక్యంగా ఈ జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించేందుకై చర్యలు చేపట్టింది। ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు గాను పది, చికెన్ వ్యర్దాల సేకరణకు 50 కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది। పాత వరంగల్ జిల్లాకు చెందిన 700 మంది అధికారులును మేడారాని 38 సెక్టార్లుగా విభజించి విధుల నిర్వహణకు నియమించారు। అన్ని నెట్వర్క్ లకు చెందిన మొబైల్ టవర్లను ఏర్పాటు చేసేందుకు ఆయా యాజమాన్యాలతో మాట్లాడారు। జాతర మొత్తం లో 100 ఎల్ ఈ డీ స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నారు। జాతర నిర్వహణనుఁ పర్యవేక్షించేందుకై 50 సి సి కెమెరాలు, పది డ్రోన్ కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు।
పోలీస్ శాఖ ద్వారా విస్తృత ఏర్పాట్లు::
జాతర లో ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులు సులభంగా అమ్మవార్ల దర్శనం చేసుకునేందుకు పోలీస్ శాఖ దాదాపు పన్నెండు వేలమంది పోలీసులను నియమించింది। మేడారం లో మూడు ప్రత్యేక క్యామ్పులు ఏర్పాటు చేయడం తో పాటు 23 మినీ పోలీస్ క్యామ్లను కూడా ఏర్పాటు చేసింది। దాదాపు 300 సి సి కెమెరాలు, మూడు డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు। వాహనాల కుగాను ప్రత్యేకంగా 32 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు।
కన్నెకంటి వెంకట రమణ
డిప్యూటి డైరెక్టర్,
సమాచార, పౌర సంబంధాల శాఖ