హత్యాయత్నం కేసులో ఐదేళ్ళు జైలు శిక్ష

నల్గొండ : భూ తగాదాలకు సంబంధించి వ్యక్తిపై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష,  వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ నల్గొండ అసిస్టెంట్ సెస్షన్స్ జడ్జి ఎం. వెంకటేశ్వర్ రావు తీర్పు చెప్పారు.


కేసు వివరాలోకి వెళితే తేది. 20 మార్చ్ 2017 రోజున నల్గొండ పట్టణ శివారు గంధంవారి గూడెంకు చెందిన ఆవుల సోమయ్య గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద కిరాణం షాపులో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ఆయన స్వగ్రామమైన గంధంవారి గూడెంకు చెందిన నక్కరబోయిన అనీల్, అల్లి నర్సింహా ఘర్షణ పడుతుండగా వారిని సోమయ్య నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నిందితుడు అనిల్ కు సోమయ్యకు మధ్య గతంలో ఉన్న భూ వివాదాలను మనసులో పెట్టుకొని సోమయ్య దాడి చేయడంతో పాటు రొకలిబండ తో హత్యాయత్నం చేయబోయారు. అనిల్ దాడి చేయడంతో బాధితుడు సోమయ్యకు తలలో, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి.  స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు సోమయ్యకు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నల్గొండ వన్ టౌన్ పోలీసులు సోమయ్య కుమారుడు ఆవుల ప్రభాకర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నివేదిక సమర్పించారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం ఇద్దరు నిందితులు నక్కరబోయిన అనీల్, అతని అమ్మమ్మ నక్కరబోయిన దేవమ్మలకు అయిదు సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించారు.


ప్రభుత్వం తరఫున అదనపు పిపి శ్రీవాణి వాదించగా అప్పట్లో ఎస్.ఐ. గా విధులు నిర్వహించిన హరిబాబు, ప్రస్తుత వన్ టౌన్ సిఐ సురేష్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ వి. రాంబాబు, లైజన్ ఆఫీసర్ వి. శ్రీనివాస్ లు సహకరించారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...