ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి ప్రసాద్ గారు తమ అధికార పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం తో కార్యవర్గ సమావేశం నిన్న అనగా 25 అక్టోబర్ రోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యాలయంలో జరిగినది.*
*ముఖ్యఅతిథిగా గ్లోబల్ ప్రధాన కార్యదర్శి శ్రీ పసుమర్తి మల్లికార్జున్ గారు మరియు అతిథులుగా గ్లోబల్ ట్రెజరర్ శ్రీ ఎల్ వి కుమార్ గారు మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కౌటికె విఠల్ గారు పాల్గొన్నారు.*
*తెలంగాణ రాష్ట్రంలో మహిళా విభాగం చేపట్టవలసిన కార్యక్రమాలు మరియు భవిష్యత్తు కార్యాచరణ గురించి జాతీయ అధ్యక్షురాలు వివరంగా సలహాలు ఇవ్వడం జరిగినది. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ మల్లికార్జున గారు మహిళా విభాగ ఆవశ్యకత ఉద్దేశ్యాలు గురించి సవివరంగా మాట్లాడడం జరిగినది.*
*ఈ సందర్భంగా తమ కార్యాలయానికి మొదటిసారి విచ్చేసిన గ్లోబల్ కార్యదర్శి శ్రీ మల్లికార్జున గారికి ట్రెజరర్ శ్రీ ఎల్ వి కుమార్ గారికి మరియు మహిళా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి ప్రసాద్ గారికి తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గా నియమితులైన శ్రీమతి జూలూరి స్వరూపారాణి గార్లను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కౌటికె విఠల్ గారు ఉచిత రీతిన సత్కరించడం జరిగినది..