*అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నర్మద*
నల్గొండ : జిల్లా అదనపు ఎస్పీగా నర్మద బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో బాధ్యతలు నిర్వహిస్తూ నల్గొండకు బదిలీ పై వచ్చిన ఆమె జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కాగా నల్గొండ అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన పద్మనాభ రెడ్ది హైదరాబాద్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు బదిలీ అయ్యారు.
జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె క్యాంపు కార్యాలయంలో ఎస్పీ రంగనాధ్ ను కలిశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని విభాగాలను, ఏ.ఆర్. భవనాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.
డిపిఓ కార్యాలయ ఏ.ఓ. నాగరాజన్, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, దయాకర్, విజయ్ కుమార్, ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, ఆర్.ఐ.లు ప్రతాప్, శంకర్, స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, సిఐలు రవి కుమార్, సత్యం, రాజశేఖర్ గౌడ్, అంజయ్య, సెంట్రల్ కంప్లైంట్ సెల్ సిబ్బంది తదితరులు ఆమెకు బొకేలు, మొక్కలు అందించి స్వాగతం పలికారు.
అనంతరం ఆమె జిల్లా జడ్జ్ ఎం.వి. రమేష్ బాబును జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.